నిద్రించే ముందు పొర‌పాటున కూడా చేయ‌కూడ‌ని మూడు త‌ప్పులు ఇవే!

శారీరక మరియు మానసిక ఆరోగ్యం బాగుండాలి అంటే కంటి నిండా ఖ‌చ్చితంగా నిద్ర ఉండాలి.

ఆహారం లేకపోయినా కొన్ని రోజులు జీవించవచ్చు.కానీ నిద్ర లేకపోతే మాత్రం చాలా కష్టం.

కంటి నిండా నిద్ర ఉంటే తొంబై శాతం రోగాలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతుంటారు.

అందుకే నిద్రను ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు.అయితే నిద్రించడానికి ముందు కొందరు తెలిసో తెలియకో కొన్ని కొన్ని తప్పులు చేస్తుంటారు.

వాటి వల్ల అనేక సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.ముఖ్యంగా నిద్రపోయే ముందు అస్సలు చేయకూడని మూడు తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా కొందరు నిద్రించడానికి ముందు స్వీట్స్ ను తింటుంటారు.ఒకవేళ మీకు కూడా ఈ అలవాటు ఉంటే వెంటనే దాన్ని వదులుకోండి.

నిద్రించడానికి ముందు పొరపాటున కూడా స్వీట్స్ ను తినకూడదు.స్వీట్స్ మీ మంచి నిద్రను ప్రభావితం చేస్తాయి.

పైగా నిద్రించే ముందు స్వీట్స్ ను తీసుకోవడం వల్ల వేగంగా బరువు కూడా పెరుగుతారు.

"""/"/ అలాగే నిద్రించే ముందు చాలా మంది మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్ వంటి గడ్జెట్స్ ను పక్కనే పెట్టుకుని పడుకుంటారు.

కానీ, ఇక‌పై అలా అస్సలు చేయకండి.ఎందుకంటే వాటి నుంచి వచ్చే రేడియేషన్ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

అలాగే నిద్రను సైతం చెడగొడుతుంది.ఇక కొందరు వర్క్ పూర్తయిన వెంటనే నిద్రపోతుంటారు.

కానీ ల్యాప్‌టాప్‌ మరియు ఫోన్స్‌ లో వర్క్, మీటింగ్స్ వంటివి కంప్లీట్ చేసిన వెంటనే పడుకోవడం చాలా త‌ప్పు.

ఇలా చేయడం వల్ల మీ శరీరం రెస్ట్ మోడ్ లో ఉన్నా మైండ్ యాక్టివ్గానే ఉంటుంది.

వ‌ర్క్‌కు సంబంధించి విష‌యాలు గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి.దాంతో మీరు ప్రశాంతమైన నిద్రను పొందలేకపోతుంటారు.

అంద‌కే వర్క్ ఫినిష్ అయిన వెంటనే బుక్స్ చదవడం, యోగ, వాకింగ్‌ వంటివి చేసి అప్పుడు నిద్రపోవాలి.

గేమ్ చేంజర్ సినిమా క్లైమాక్స్ ఫైట్ కోసం 15 కోట్లు ఖర్చు పెట్టారా..?