రాఖీ పండుగ రోజు చేయాల్సిన చేయకూడని పనులు ఇవే..!

రాఖీ పండుగ( Raksha Bandhan ) అంటే అన్నా తమ్ముళ్లకు ఒక రాఖీ కట్టేసి వారికి స్వీట్ తినిపించి వారి నుంచి కానుకలు తీసుకుంటే సరిపోతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు.

కానీ రాఖీ పండుగ రోజు కూడా పాటించాల్సిన కొన్ని నియమాలు, అలాగే చేయకూడని కొన్ని పనులు కూడా ఉన్నాయి.

వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.రాఖీ అంటే ఏదో సింపుల్ గా పండుగ మాత్రమే అనుకోకండి.

ఆ రోజున మీ అన్నకి కానీ తమ్ముళ్లకు కానీ నిద్ర లేవకుండానే రాఖీ కట్టేసి వెళ్ళిపో అంటుంటే మాత్రం అస్సలు కుదరదు అని చెప్పేయండి.

ఎందుకంటే ఇది కేవలం చేతికి ఏదో చిన్న దారం కట్టి వదిలేసే పండుగ మాత్రం కాదు.

"""/" / మనం దీపావళి( Diwali ) దసరా, వినాయక చవితిని ఎంత నిష్టగా చేసుకుంటామో ఈ రాఖీ పండుగను కూడా అలాగే జరుపుకోవాలి.

కాబట్టి రాఖీ కట్టే ముందు అన్న తమ్ముళ్లు రాఖీ కట్టే ఆడపిల్లలు కూడా ఉదయాన్నే లేచి తన స్నానం చేయాలి.

అలాగే రాఖీ కట్టే ముందు అన్నదమ్ములను పీఠవేసి కూర్చోబెడితే ఎంతో మంచిది.అంతేకాకుండా కూర్చుని దిశ కూడా ఎంతో ముఖ్యం.

తూర్పు కాని ఉత్తరం వైపు కానీ ఎంతో మంచిది.దక్షిణ దిశ వైపు మాత్రం అస్సలు కూర్చోకూడదు.

30వ తేదీన పొరపాటున దక్షిణ దిశ వైపు కూర్చొని రాఖీ కట్టిన కట్టించుకున్న ఇంట్లో నెగటివ్ ఎనర్జీ( Negative Energy ) ప్రవహిస్తుంది.

"""/" / అలాగే రాఖీ కట్టేటప్పుడు అన్నలు తమ్ములు తమ తలపై ఏదైనా కర్చీఫ్ ధరిస్తే మంచిది.

అదే విధంగా రాఖీ కట్టే ఆడపిల్లలు కూడా దుపట్టాను తలపై వేసుకోవాలి.ఇలా చేస్తే మంచిది అని పండితులు ( Scholars )చెబుతున్నారు.

తమ్ముళ్లకు అన్నలకు రాఖీ కట్టే ముందు దేవుడికి దండం పెట్టుకోవాలి.ఇంట్లో వినాయకుడి ఫోటో కు కానీ, విగ్రహానికి కానీ బొట్టు పెట్టి ముందు ఆయనకు రాఖీ సమర్పించాలి.

ఎందుకంటే ఒక అన్న, తమ్ముడు, తండ్రిలాగే గణనాథుడు కూడా సర్వ విఘ్నాలను తొలగించి మనల్ని రక్షిస్తాడు.

కాబట్టి ముందు రాఖీ ఆయన కు కట్టాలి.ఆ తర్వాత అన్నకు, తమ్ముళ్లకు కుంకుమ పెట్టి హారతి ఇచ్చి రాఖీ కట్టాలి.

ఆ తర్వాత మిఠాయిలు తినిపించాలి.