తెలుగు ప్రేక్షకుల వల్ల ప్లాప్ అయినా సూపర్ సినిమాలు ఇవే!

కొన్ని సినిమాలను చూసినప్పుడు ఈ సినిమా థియేటర్ లోనే ఎందుకు చూడలేదు? ఎందుకు తగిన గుర్తింపు రాలేదు అని అనిపిస్తూ ఉంటుంది.

అలాంటి సినిమాలు తెలుగులో చాలానే ఉన్నాయి.తెలుగులో అండర్ రేటింగ్ మూవీస్ విషయాలకొస్తే శంభో శివ శంభో సినిమాలో ముగ్గురు స్నేహితుల మధ్య నడిచే సంఘటన.

ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది.ఈ మూవీ కొందరికి చాలా బాగా నచ్చింది.

మరికొందరికి నచ్చక పోవడం వల్ల, దాన్ని బట్టి రేటింగ్ ఇవ్వడం వల్ల ఈ చిత్రం ఫ్లాప్ అయిందని చెప్పవచ్చు.

ఇక ఆ తర్వాత మహేష్ బాబు తీసిన ఖలేజా సినిమా కూడా అలాంటిదే.

సరికొత్త కథతో వచ్చిన దర్శకుడు ఈ చిత్రాన్ని తీసినప్పటికీ అంతటి స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది.

ఆ తర్వాత అదే ఏడాదిలో రిలీజ్ అయిన రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా కూడా అలాంటి కోవకు చెందిందే ఈ సినిమా విడుదల కాకముందే హరీష్ జయరాజ్ అందించిన సంగీతం ఎందరికో చేరువైంది.

ఇప్పటికీ చాలామంది ప్లే లిస్టులో తమ బెస్ట్ సాంగ్ లిస్టులో ఈ సినిమా పాటలు ఉంటాయి.

లవ్ ఎక్కువ రోజులు ఉండదన్న కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో హిట్ కాకపోయే సరికి, రామ్ చరణ్ ఇక అలాంటి లవ్ స్టోరీ కథ ఉన్న సినిమాలను మళ్ళీ తీయడానికి ఆలోచించరని తెలుస్తోంది.

"""/"/ థియేటర్లో ఏ సినిమా చూసినప్పుడు ఆ ఫీల్ కలగలేదు ఏమో గాని అదే సినిమా టీవీ లో చూసినప్పుడు అరే ఇంత మంచి సినిమాలు అప్పట్లో ప్లాప్ చేసాము అని అనిపిస్తుంది ఒక్కోసారి.

ఆ సినిమానే పిల్లజమిందార్.నాని చేసిన ది బెస్ట్ సినిమాల్లో మొదటి చిత్రం జెర్సీ అయితే రెండో చిత్రం పిల్ల జమిందార్ అని చెప్పవచ్చు.

అంతేకాకుండా ఘాజి సినిమా వచ్చినప్పుడు ప్రత్యేక కథతో, వచ్చిన సినిమా, ఎక్స్పెరిమెంటల్ సినిమా అన్నారు.

కానీ అంతకుముందే నాగార్జున గారు కథనం సినిమాతో ఎక్స్పెరిమెంటల్ సినిమాలను మొదలుపెట్టారు.ఈ చిత్రంలో అందరూ బాగా నటించినా, అన్ని గ్రాఫ్స్ సరిగా ఉన్నా కూడా అప్పట్లో ఈ సినిమా అంతగా ఆడలేకపోయింది.

"""/"/ ఇకపోతే ఇప్పుడు కన్నడ రీమేక్ అయిన ఈ సినిమాను అందరూ మెచ్చుకుంటున్నారు కానీ అప్పట్లోనే ఇలాంటి సినిమా తరహాలోనే అందాల రాక్షసి కూడా వచ్చింది.

ఆ సినిమాలో ఉన్న సాంగ్స్ ఇప్పటికీ చాలామందికి కరెక్ట్ గానే ఉంటాయి.కానీ ఆ సినిమాలో కథ చాలా స్లోగా ఉంటుంది.

కాబట్టి అది జనాలకు చేరువ కాలేకపోయింది అని చెప్పవచ్చు.ఆ తర్వాత 2012లో వచ్చిన ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రం కూడా ఆరెంజ్ ఇలాంటి మంచి రియాలిటీకి దగ్గరగా ఉన్న సినిమానే.

దీంతో పాటు అదే సంవత్సరంలో వచ్చిన సాహసం సినిమా కూడా అలాంటి అపజయాన్నే ఎదుర్కొంది.

ఒక మంచి అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా.సినిమా అంతా కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా బాగా ఉంటుంది ఎంత బాగా ఉన్నా కూడా బాక్సాఫీస్ వద్ద మాత్రం అందుకోలేకపోయింది.

"""/"/ ఇక పోతే ఆ తర్వాత వచ్చిన 1 నేనొక్కడినే అనే సినిమా కూడా అలాంటిదే.

ఈ సినిమాను ఒక జీనియస్ హాలీవుడ్ డైరెక్టర్ తీసినట్లుగా కూడా చెప్పుకోవచ్చు.మొదటిసారిగా ఈ సినిమాను చూసినప్పుడు అంతగా అర్థం కాకపోయినా తర్వాత చూసినప్పుడు కథేంటో బాగా అర్థమవుతుంది.

ఇదే సినిమాను సుకుమార్ జనానికి అర్థమయ్యేలా ఇంకో విధంగా తీసినట్లయితే ఒకవేళ అప్పుడు విజయం సాధించేదేమో.

ఇకపోతే అప్పట్లో ఒకడుండేవాడు ఈ సినిమా కూడా చాలా బాగుంటుంది.ఈ చిత్రం కూడా కథ ఎంత బాగున్నా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇవే కాకుండా ఇంకా ఎన్నో చిత్రాలు వండర్ రేటింగ్ పొజిషన్ లో ఉన్నాయని చెప్పవచ్చు.

20 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆర్య.. ఈ హిట్ చిత్రాన్ని వదులుకున్న హీరోలు ఎవరో తెలుసా?