మహిళల్లో సంతాన సామర్థ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే..!
TeluguStop.com
మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, హార్మోన్ల అసమతుల్యత మరియు ఇతర అనారోగ్య సమస్యల( Health Problems ) కారణంగా ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది మహిళలు సంతాన లేమితో బాధపడుతున్నారు.
పెళ్లై ఏళ్లు గడుస్తున్న పిల్లలు పుట్టక హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు.అయితే సంతాన సామర్థ్యాన్ని పెంచడంలో కొన్ని ఆహారాలు ఎంతో ఉత్తమంగా సహాయపడతాయి.
అటువంటి సూపర్ ఫుడ్స్ ఏవేవో ఇప్పుడు తెలుసుకుందాం.మహిళల్లో ఫెర్టిలిటీకి ఫోలిక్ ఆమ్లం ( Folic Acid )అనేది ఎంతో కీలకమైనది.
ఫెటస్‌లో న్యూరల్ ట్యూబ్ డెఫెక్ట్స్ తగ్గించడంలో మరియు సంతాన సామర్థాన్ని పెంచడంతో ఫోలిక్ ఆమ్లం తోడ్పడుతుంది.
అందుకే ఫోలిక్ ఆమ్లం మెండుగా ఉండే పాలకూర, మెంతికూర, బీన్స్, గుడ్లు, మామిడి పండ్లు, అవకాడో, సిట్రస్ ఫ్రూట్స్( Lettuce, Fenugreek, Beans, Eggs, Mangoes, Avocado, Citrus Fruits ) ను డైట్ లో చేర్చుకోవాలి.
"""/" /
నిత్యం ఉదయం నానబెట్టిన బాదం మరియు వాల్‌నట్స్ ( Walnuts )ను తీసుకోండి.
వీటిలో మంచి కొవ్వులు, విటమిన్ ఇ ఉంటాయి, ఇవి రిప్రొడక్టివ్ హెల్త్‌కు ఎంతో అవసరం.
మహిళల్లో సంతాన సామర్థ్యం పెరగాలంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ ను తప్పక డైట్ లో చేర్చుకోవాలి.
ఐరన్ గర్భాశయానికి రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది.అదే సమయంలో రక్తహీనతను నివారిస్తుంది.
బీట్ రూట్, గోధుమలు, జొన్న, రాగి, సోయా బీన్స్, ఎండుద్రాక్ష, ఖర్జూరంలో( Beet Root, Wheat, Sorghum, Copper, Soya Beans, Raisins, Dates ) ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.
"""/" /
హార్మోన్ల స్థిరత్వానికి మరియు గర్భాశయ శ్రేయస్సుకు ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్( Omega-3 Fatty Acids ) తోడ్పడతాయి.
చేపలు, వాల్‌నట్స్, చియా సీడ్స్, అవిసె గింజల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధిక మొత్తంలో ఉంటాయి.
బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, నారింజ, కివి, గ్రీన్ టీ వంటి ఫుడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.
ఇవి గర్భసంచిలో మరియు అండకోశాలపై ఒత్తిడిని తగ్గిస్తాయి.మహిళల్లో సంతాన సామర్థాన్ని పెంపొందిస్తాయి.
ఇక కోడిగుడ్లు, చికెన్, గుమ్మడి గింజలు, పప్పు ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
వీటిలో మెండుగా ఉండే ప్రోటీన్ అండకోశాల ఆరోగ్యాన్ని పెంచాయి.మరియు హార్మోన్ ఉత్పత్తికి తోడ్పడతాయి.
నా సంపాదన అంతంత మాత్రమే.. మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!