రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న స్టార్ హీరోయిన్స్ వీళ్ళే…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలను పూర్తి చేసుకుంటూ మూడోదశబ్దంలోకి కూడా అడుగుపెట్టి ఇప్పటికి స్టార్ హీరోయిన్లు గా రాణిస్తున్న హీరోయిన్లు కొంతమంది ఉన్నారు.
అందులో ముఖ్యంగా త్రిష, నయనతార( Trisha , Nayanthara ) లాంటి స్టార్ హీరోయిన్ల గురించి చెప్పుకోవాలి.
2004 లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన త్రిష ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.
"""/" /
ఇక ఆ తర్వాత "వర్షం ", "నువ్వు వస్తానంటే నేను వద్దంటనా", "అతడు" లాంటి సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకున్న స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.
ఇక తను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా తను స్టార్ హీరోలతో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది.
ఇక చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభర సినిమా( Vishwambhara)లో హీరోయిన్ గా సెలెక్ట్ అవ్వడం విశేషం.
ఇక ఈమెతోపాటుగా నయనతార( Nayanthara ) కూడా ఇప్పటికి హీరోయిన్ గా పలు సినిమాల్లో నటిస్తూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటుంది.
"""/" /
ఇక ఈమె కూడా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్న కూడా ఇప్పటికీ ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్ళడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇలా వీళ్లు సినిమా ఇండస్ట్రీలో తమదైన సేవలను అందిస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా వాళ్ళ డెడికేషన్ కి మెచ్చుకోవచ్చు అనే చెప్పాలి.
ఇక ఇవాళ్ళ, రేపు హీరోయిన్ల సినీ కెరియర్ మహా అయితే ఒకటి రెండు సినిమాలతో ముగిస్తుంది.
అలాంటిది వీళ్ళు మాత్రం 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగడం అంటే మామూలు విషయం కాదు.
స్టార్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ వీళ్ళ ప్రయాణం అనేది సాగుతుందనే చెప్పాలి.
దేవకట్టా డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నాడా..?