Tollywood Heroines: నిర్మాతలుగా మారి కోట్లు నష్టపోయిన స్టార్ హీరోయిన్స్ వీళ్ళే?
TeluguStop.com
తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరో హీరోయిన్గా అడుగుపెట్టిన వారందరూ కూడా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం ఇండస్ట్రీలో వారు కూడా నిర్మాతలుగా మారి ఎన్నో సినిమాలను నిర్మించారు.
ఇలా ఇప్పటికి ఇండస్ట్రీలో ఎంతోమంది నిర్మాతలుగా( Producers ) కూడా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందినటువంటి వారు కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.
అయితే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి అప్పటివరకు వారు సినిమా ఇండస్ట్రీలో సంపాదించినది మొత్తం పోగొట్టుకున్నటువంటి సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు.
మరి ఇండస్ట్రీలోకి వచ్చి నిర్మాతలుగా మారి సంపాదించినది మొత్తం పోగొట్టుకున్నటువంటి హీరోయిన్స్ ఎవరు అని విషయానికి వస్తే.
H3 Class=subheader-styleజయసుధ:/h3p సహజనటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి జయసుధ (Jayasudha) నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి కాంచన, సీత, కలికాలం, అదృష్టం వింత కోడలు వంటి సినిమాలను నిర్మించి అప్పటివరకు ఆమె ఇండస్ట్రీలో సంపాదించినది మొత్తం నష్టపోయారు.
"""/" /
H3 Class=subheader-styleవిజయశాంతి:/h3p విజయశాంతి (Vijaya Shanthi) హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు బాలకృష్ణ హీరోగా నిప్పురవ్వ అనే సినిమా చేశారు.
అయితే ఈ సినిమా ద్వారా ఈమె కోట్ల రూపాయల నష్టాలను ఎదురుకోవాల్సి వచ్చింది.
"""/" /
H3 Class=subheader-styleరోజా:/h3p రోజా (Roja) హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
అయితే ఈమె సక్సెస్ అయిన తర్వాత తన భర్త సెలవమని దర్శకత్వంలోనే ఈమె ఒక సినిమాని నిర్మించారు.
అయితే ఈ సినిమా వల్ల అప్పటివరకు సంపాదించినది మొత్తం కోల్పోయి అప్పుల పాలయ్యామని తెలిపారు అయితే ఇండస్ట్రీలో కొనసాగుతూనే అప్పులన్నీ తీర్చిన తర్వాతే తాను పెళ్లి చేసుకున్నానని ఈ సందర్భంగా తెలియజేశారు.
"""/" /
H3 Class=subheader-styleశ్రీదేవి:/h3p భారత సిని ఇండస్ట్రీలోనే అందాల తారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శ్రీదేవి (Sridevi) ఎన్నో సినిమాలకు సహా నిర్మాతగా వ్యవహరించారు.
ఈమె నిర్మాతగా వ్యవహరించినటువంటి పలు సినిమాలలో కోట్లలో నష్టాలను ఎదుర్కొన్నారు. """/" /
H3 Class=subheader-styleకళ్యాణి:/h3p సినీ నటిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కళ్యాణి( Kalyani ) దర్శకుడిని పెళ్లి చేసుకున్నారు.
అయితే ఆయనతో కలిసి ఈమె నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు.ఇక ఈ సినిమాని నిర్మించడం వల్ల భారీ స్థాయిలో నష్టాలు రావడం ఆ నష్టాలను పూడ్చటానికి ఆస్తులు అమ్మడం భార్యాభర్తల మధ్య గొడవ జరిగి విడిపోవడం కూడా జరిగింది.
"""/" /
H3 Class=subheader-styleచార్మి:/h3p టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి చార్మి (Charmi) పూరి జగన్నాథ్ తో కలిసి ఒక నిర్మాణ సంస్థను స్థాపించారు ఈ నిర్మాణ సంస్థలు ఈమె ఎన్నో సినిమాలను చేసి భారీ స్థాయిలో నష్టాలను ఎదుర్కొంటున్నారు.
"""/" /
H3 Class=subheader-styleసావిత్రి:/h3p తెలుగు చిత్ర పరిశ్రమలో మహానటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సావిత్రి( Savitri ) హీరోయిన్ గా ఎంతో మంచే సక్సెస్ అయ్యారు అయితే ఈమె నిర్మాతగా మరి ఎన్నో సినిమాలను నిర్మించి భారీ స్థాయిలో నష్టాలను ఎదుర్కొని చివరికి ఎంతో దీన స్థితికి వెళ్లిపోయారు.
ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకొని నిర్మాతలుగా నష్టాలను ఎదుర్కొన్న సెలబ్రిటీలుగా గుర్తింపు పొందారు.
వైరల్ వీడియో: బాబోయ్ అరాచకం.. ఇటుకతో అలా చేయడం అవసరమా?