ఒకే సంవత్సరం డైరెక్టర్ గా పరిచయం అయిన స్టార్ డైరెక్టర్స్ వీళ్లే…

పేరుకి తమిళ డైరెక్టర్ అయిన కూడా తెలుగు లో చాలా మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్న ఒకేఒక డైరెక్టర్ శంకర్ ( Director Shankar )ఈయన తీసిన సినిమాలు సామాజిక, సందేశాత్మక అంశాలతో ఉండటం వల్ల అవి ఆడియెన్స్ ను ఎక్కువ గా ఆకట్టుకుంటాయి.

ఇక జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ తరువాత హాస్యా చిత్రాలకు కేరాఫ్ గా అందరూ చెప్పుకునే డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డి( Director SV Krishna Reddy ).

కృష్ణారెడ్డి ఫ్యామిలీ కథలు ఎంపిక చేసుకొని అందులోనే తన మార్క్ హాస్యాన్ని జోడించి చిత్రాలను తెరకెక్కింస్తుంటారు.

తక్కువ చిత్రాలతోనే ఆడియెన్స్ అభిమానాన్ని సంపాదించుకున్నారు.మరో హాస్య దర్శకుడు శివనాగేశ్వరరావు( Director Sivanageswara Rao ) ఈ ముగ్గురు దర్శకులు ఒకే సంవత్సరం ఈ సినిమాలతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు.

ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. """/" / శంకర్ దర్శకత్వం వహించగా, కుంజుమోన్ నిర్మాతగా 1993లో ‘జెంటిల్ మెన్’( Gentlemen ) సినిమా రిలీజ్ అయింది.

ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా యాక్షన్ కింగ్ అర్జున్, మధుబాల నటించారు.ఏ.

ఆర్ రెహమాన్ సంగీతం అందించిన సాంగ్స్ అప్పటి యువతను ఉర్రూత లూగించాయి.చదువు కోసం ధనవంతులు డబ్బును దోచుకుని పేదవారికి సాయం చేసే క్యారెక్టర్ లో అర్జున్ నటన ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.

తమిళ్ డబ్బింగ్ చిత్రం అయినప్పటికి తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది.ఎస్.

వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘రాజేంద్రుడు గజేంద్రుడు’( Rajendrudu Gajendrudu' ) 1993 లో రిలీజ్ అయ్యింది.

ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య జంటగా నటించారు.ఎస్.

వి.కృష్ణారెడ్డికి ఈ చిత్రం దర్శకుడిగా తొలి సినిమా.

ఇందులో ఏనుగు కీలక పాత్రను పోషించింది. """/" / శివనాగేశ్వరరావు డైరెక్షన్ లో వచ్చిన మనీ( Money ) సినిమా 1993లో విడుదల అయ్యింది.

ఈ సినిమాకి రామ్ గోపాల్ వర్మ ప్రొడ్యూస్ చేశారు.ఇది ఒక క్రైం కామెడీ చిత్రం.

ఇందులో జె.డి.

చక్రవర్తి, చిన్నా హీరోలుగా నటించారు.జయసుధ, బ్రహ్మానందం, పరేష్ రావెల్ ముఖ్యమైన క్యారెక్టర్స్ లో నటించారు.

ఈ సినిమా శివ నాగేశ్వరరావుకు డైరెక్టర్ గా మొదటి చిత్రం.ఈ విధంగా ఈ ముగ్గురు డైరెక్టర్స్ తొలి చిత్రంతోనే సూపర్ హిట్స్ ని సాధించారు అది కూడా ఓకే సంవత్సరం లో సాధించడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

సూపర్ స్టార్ మహేష్ కు అలాంటివి నచ్చవా.. జక్కన్న మూవీ కోసం తొలిసారి మారారా?