రామ్ చరణ్ బుచ్చి బాబు సినిమా లో నటించే స్టార్ నటులు వీళ్లే…

మెగా పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్.

( Ram Charan ) ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఇలాంటి క్రమం లోనే తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకుంటున్నాడు.

ఇక ఆయన ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్( Game Changer ) సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు( Buchibabu ) డైరెక్షన్ లో చేయబోయే సినిమాల కోసం భారీ కసరత్తులను చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో రోజురోజుకి స్టార్ కాస్టింగ్ భారీగా పెరిగిపోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది.

"""/" / ఇక ఇప్పటికే ఈ సినిమాలో తమిళ్, మలయాళం, కన్నడ ఆర్టిస్టులను ఇన్వాల్వ్ చేస్తూ చాలామంది నటీనటులను ఈ సినిమా కోసం తీసుకుంటున్నారు.

ఇక ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం కన్నడ సుదీప్ ను( Sudeep ) తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

అలాగే బాలీవుడ్ నుంచి అనిమల్ సినిమాతో విలన్ గా తనకంటు ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న బాబీ డియోల్ ను( Bobby Deol ) ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం తీసుకోబోతున్నట్లుగా కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి.

మరి దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ రావాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

"""/" / ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో రామ్ చరణ్ మంచి దూకుడు మీదున్నాడు.

అలాగే బుచ్చిబాబు కూడా ఉప్పెన సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు కాబట్టి ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇలాంటి క్రమం లోనే వరుసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు పొందుతున్నాడు.

ఇక ఈ సినిమా సక్సెస్ అయితేనే బుచ్చి బాబుకి మరింత పెద్ద అవకాశాలు వచ్చే ఛాన్స్ లు అయితే ఉన్నాయి.

చూడాలి మరి ఈ సినిమాతో బుచ్చిబాబు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది.

ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య‌ను ఎలా గుర్తించాలి.. ల‌క్ష‌ణాలేంటి..?