మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాల్లో జింక్ కూడా ఒకటి.రోగనిరోధక శక్తి, కణాల ఎదుగుదల, కణ విభజన, ప్రోటీన్లు, డీఎన్ఏ నిర్మాణం లో జింక్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది.
"""/" /
అలాగే గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేల చేసేందుకు, గాయాలను త్వరగా నయం చేసేందుకు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా జింక్ ఎంతో అవసరం.
మన బాడీ జింక్ ను స్టోర్ చేసుకోలేదు.కాబట్టి నిత్యం మనం శరీరానికి జింక్ ను అందిస్తూ ఉండాలి.
రోజూ ఆడవారికి 8 మిల్లీ గ్రాముల జింక్ అవసరమైతే.మగవారికి 11 మిల్లీ గ్రాముల జింక్ అవసరం.
జింక్ లోపం ఏర్పడితే మన శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. """/" /
ప్రధానంగా వెయిట్ లాస్( Weight Loss ) అవుతారు.
జింక్ లోపం కారణంగా జీర్ణశక్తి పనితీరు తగ్గుతుంది.ఆకలి మందగిస్తుంది.
ఆహారం తీసుకునేందుకు నిరాకరిస్తారు.ఫలితంగా బరువు తగ్గుతారు.
పోషకాల లోపం వల్ల బరువు తగ్గితే ఎన్నో అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
అలాగే శరీరానికి తగినంత జింక్ అందకపోతే దృష్టి సమస్యలు తలెత్తుతాయి.కంటి చూపు మందగించడం ప్రారంభమవుతుంది.
అంతేకాదు జింక్ లోపం వల్ల రోగ నిరోధక వ్యవస్థ( Immune System ) బలహీన పడుతుంది.
తరచూ జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు పెరుగుతాయి.జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది.
పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది.చేసే పనిపై ఏకాగ్రత పెట్టలేరు.
మనసు, ఆలోచనలు గందరగోళంగా ఉంటాయి.జ్ఞాపక శక్తి తగ్గుతుంది.
ఇటువంటి లక్షణాలు మీలో కనుక కనిపిస్తే జింక్ లోపమని గుర్తించండి.జింక్ పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోండి.
పుచ్చ గింజలు, శనగలు, జనపనార గింజలు, జీడిపప్పు, పెరుగు, ఓట్స్, నట్స్, చేపలు, పాలు, గుమ్మడి గింజలు, చీస్, ఎర్ర కందిపప్పు, నువ్వులు తదితర ఆహారాల్లో జింక్ మెండుగా ఉంటుంది జింక్ లోప నివారణకు ఈ ఆహారాలను తప్పకుండా డైట్ లో చేర్చుకోండి.
మరియు వైద్యుల సలహా మేరకు జింక్ సప్లిమెంట్స్( Zinc Supplements) ను కూడా తీసుకోవచ్చు.
చెప్పులేసుకుని శివప్రదక్షిణ.. హీరోయిన్ స్నేహను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!