వారాహి నవరాత్రి దీక్ష పూజలో తప్పక పాటించాల్సిన నియమాలు ఇవే..!
TeluguStop.com
వారాహి నవరాత్రి దీక్షలు( Varahi Navratri Deekshas ) చేసేవారు కొన్ని ఆహార నియమాలు పాటించాలని శాస్త్రం చెబుతోంది.
అయితే తొమ్మిది రోజులు పాటు ఉదయం, సాయంత్రం ఏడుపూట్ల కూడా పూజ చేయడంతో బ్రహ్మచర్యం పాటించాలి.
అలాగే దీక్షలో కూర్చున్న పది రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి.కేవలం వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి.
అలాగే వెజిటేరియన్ ఫుడ్ ( Vegetarian Food )మాత్రమే వండాలి.ఏ పదార్థాన్ని వండినా కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాతే ప్రసాదంగా భుజించాలి.
ఇక వీలైతే పది రోజుల పాటు అఖండ దీపం పెట్టుకుంటూ ఉంటే మంచిది.
"""/" /
ఇక ఆడవారు, మగవారు కూడా వారాహి పూజ ఇంట్లో నిర్వహించవచ్చని పెద్దవాళ్ళు చెబుతున్నారు.
అయితే వారాహి పాడిపంటలకు, భూమికి సంబంధించిన పూజ.కాబట్టి మొదటి రోజు కొత్త కుండలో మట్టి వేసి నవధాన్యాలు( Navadhanyalu ) వేయాలి.
ఆ తర్వాత ఆ మట్టితో నిండిన పాత్రను పూజలో ఉంచితే సరిగా పదో రోజుకి మొలకలు బాగా మోలిస్తే మీ సంకల్పం నెరవేరినట్టు అని భావించాలి.
ఇక ఆ తర్వాత వాటిని ఆవుకి తినిపించాలి.పసుపు గణపతిని ప్రతిరోజు చేసి పూజ చేయాలి.
ఆ గణపతిని చేసిన పసుపు పారవేయకుండా అవసరానికి వాడుకోవాలి.విగ్రహం ఉంటే రోజు పసుపు జలంతో అభిషేకం చేయాలి.
లేదా ఫోటో మాత్రమే ఉంటే రోజు పువ్వులతో కూడా పూజ చేయవచ్చు. """/" /
విగ్రహం కానీ ఫోటో కానీ లేనివారు ఇంట్లో ఏ అమ్మవారి రూపం ఉన్న ఆ తల్లి ఫోటో ముందు దీపాన్ని పెట్టి వారాహిగా దీపాన్ని ఆవాహన చేయాలి.
ఇక సాయంత్రం పూజకి మళ్ళీ స్నానం చేసుకున్న తర్వాతే పూజ చేయాలి.ఇక మీ శక్తి మేరకు నైవేద్యం పెట్టాలి.
ప్రతిరోజు అమ్మవారికి బెల్లం పానకం పెట్టడం చాలా మంచిది.ఎందుకంటే అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ఇష్టం.
ఇక పూజలో ఉన్నప్పుడు ఎప్పుడూ నోటి నుంచి చెడు మాటలు రాకుండా చూసుకోవాలి.
అలాగే వేరే మహిళలు, పురుషుల గురించి చెడు మాటలు చెడు ఆలోచనలు రాకుండా ఉండాలి.
చెడు ఆలోచనలు వస్తే పూజలు పనికి రావని గుర్తు పెట్టుకోవాలి.
సినిమా టికెట్ల రేట్లపై నాగ వంశీ షాకింగ్ కామెంట్స్… ఆ విషయం ఎవరు చెప్పలేమంటూ?