వైకుంఠ ఏకాదశి వ్రతం చేసే వారు తప్పనిసరిగా ఆచరించాల్సిన నియమాలివే!
TeluguStop.com
మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల ఏకాదశి వస్తుంది.అయితే పుష్య మాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు.
పుష్య మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు.
ఈ వైకుంఠ ఏకాదశి ఎంతో పవిత్రమైన ఏకాదశిగా భావిస్తారు.వైకుంఠ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించడం వల్ల అందరికీ దేవతల ఆశీర్వాదం ఉంటాయని భావిస్తారు.
ఈ వైకుంఠ ఏకాదశిని పుత్ర ఏకాదశి అని పిలుస్తారు.ఈ పుత్రద ఏకాదశి రోజు ఎవరైతే పుత్ర సంతానం కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల వారికి సంతాన భాగ్యం కలుగుతుందని చెప్పవచ్చు.
అయితే ఈ పుత్ర సంతాన వ్రతాన్ని ఆచరించే వారు తప్పనిసరిగా నియమాలను పాటించాల్సి ఉంటుంది.
మరి ఆ నియమాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. """/" /
ఎవరైతే పుత్రసంతానం వ్రతాన్ని ఆచరిస్తారో వారు తెల్లవారుజామున నిద్రలేచి గంగాజలంతో స్నానమాచరించి పూజగదిని శుభ్రం చేసుకోవాలి.
ముఖ్యంగా శ్రీహరి ఫోటోకి ప్రత్యేక అలంకరణ చేసి ఈ వ్రతాన్ని ఆచరించాలి.ఇలా పుత్ర సంతాన వ్రతం లేదా ఏకాదశి వ్రతం ఆచరించే వారు ఉపవాసంతో ఈ వ్రతాన్ని ఆచరించాలి.
ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకునేవారు ఏకాదశి ముందు రోజు నేలపై నిద్ర పోవాలి.
అలాగే రోజంతా ఉపవాసం ఉంటూ నారాయణ మంత్రాలను పఠిస్తూ భగవంతుని సేవలో ఉండాలి.
అయితే ఈ ఏకాదశి వ్రతం పాటించేవారు ద్వాదశి వరకు బ్రహ్మచర్యం పాటించాలి.ఎలాంటి చెడు ఆలోచనలను మనసులోకి రానివ్వకూడదు ఎవరిని చూసి ఆకర్షితులు కాకూడదు.
ద్వాదశి రోజు శుభ్రంగా స్నానం ఆచరించి స్వయంగా వంట చేసి ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టిన తర్వాత మీ ఉపవాసాన్ని కూడా విరమించాలి.
ఇలా ఈ వ్రతం ఆచరించేవారు ఈ నియమాలను పాటించాలి.
హీరోయిన్ ఆఫర్లు రాకపోవడంతో కేతిక ఐటమ్ సాంగ్ చేసిందా.. ఆమె రియాక్షన్ ఇదే!