మే 5వ తేదీన ఏర్పడే చంద్ర గ్రహణం రోజు.. గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన నియమాలు ఇవే..!

హిందూమతంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం( Lunar Eclipse, Solar Eclipse ) గురించి ప్రజలలో చాలా నమ్మకాలు ఉన్నాయి.

గ్రహణ సమయంలో ఆహారం నుంచి అన్ని రకాల నియమాలను పాటించాలని చాలామంది ప్రజలు నమ్ముతారు.

గ్రహణం ఏర్పడే సమయంలో వాతావరణంలో ప్రతికూలత వ్యాపిస్తుంది.కాబట్టి ఈ సమయంలో కొన్ని పనులు చేస్తే జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రాలలో ఉంది.

ముఖ్యంగా గ్రహణ సమయంలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి.ఆహారం నుంచి జీవన శైలి వరకు అనేక జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

2023 వ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం మే 5వ తేదీన రాత్రి ఏర్పడుతుంది.

ఈ సంవత్సరం వైశాఖ పూర్ణిమ రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది.భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం రాత్రి 8 గంటల 44 నిమిషాల నుంచి తెల్లవారుజామున 1.

20 నిమిషములకు ముగుస్తుంది.చంద్రగ్రహణం దాదాపు 5 గంటల వరకు ఉంటుంది.

"""/" / చంద్రగ్రహణం సమయంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ గ్రహణా ప్రభావం భారతదేశంలో కనిపించకపోయినా గ్రహణం ఏర్పడే సమయంలో కొన్ని విషయాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.

ఈ సమయంలో ఆహారం తినడం నిషేధించబడింది.పెద్దలు చెప్పిన నియమాలను పట్టించుకోకుండా ఆహారం తిన్నట్లు అయితే జీర్ణ వ్యవస్థలో ఇబ్బంది ఏర్పడుతుందని చాలామంది నమ్ముతున్నారు.

ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు( Pregnant Women ) తీసుకునే ఆహారంపై మాత్రమే కాకుండా అనేక ఇతర విషయాలపై కూడా పూర్తి శ్రద్ధ వహించాలని చెబుతున్నారు.

గ్రహణ సమయంలో నీరు తాగితే శరీరానికి హాని కలుగుతుంది.దీనికి శాస్త్రీయ రుజువు లేదు.

కానీ ఇప్పటికీ ప్రజలు ఇ నియమాలను అనుసరిస్తున్నారు.గ్రహణం సమయంలో నిద్రించడం నిషేధం.

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చేసే పనుల వలన కలిగే నష్టాన్ని తల్లి, బిడ్డ ఇద్దరూ భరించవలసి వస్తుందని ప్రజలు నమ్ముతారు.

ఏపీలో నేడు పెన్షన్ పండుగ.. చంద్రబాబే స్వయంగా వెళ్లి