Vasanta Panchami :వసంత పంచమి రోజున పాటించాల్సిన వ్రత నియమాలు ఇవే..!

హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ మాసంలోని శుక్లపక్ష పంచమి తిధి ఫిబ్రవరి 14వ తేదీన వస్తుంది.

ఈ రోజున వసంత పంచమి ( Vasanta Panchami )పండుగను జరుపుకుంటారు.ఈ రోజున జ్ఞానానికి దేవత అయినా సరస్వతి తల్లిని పూజిస్తారు.

ఇలా చేయడం వలన శారదా దేవి( Sharada Devi ) సంతోషించి తన భక్తులకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది.

ఈ రోజున ప్రజలు తమ ఇళ్లలో రుచికరమైన వంటకాలు, స్వీట్లు తయారుచేసి, పసుపు బట్టలు ధరించి అమ్మవారిని కొలుస్తారు.

అంతేకాకుండా కొంతమంది సరస్వతీ పూజ రోజున ఉపవాసాన్ని కూడా పాటిస్తారు.ఈ ఉపవాసాన్ని ఎలా పూర్తి చేయాలి? ఉపవాస సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి? ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / వసంత పంచమినాడు ఉపవాసం ఉన్నట్లయితే స్నానం చేయకుండా సరస్వతిని( Saraswati ) పూజించకుండా ఏమీ తినకూడదు.

అలాగే వసంత పంచమి రోజు మొత్తం ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు.ఆ రోజున మీరు సరస్వతి దేవిని శుభ సమయంలో పూజించి ఆ తర్వాత మీ ఉపవాసాన్ని విరమించవచ్చు.

ఉపవాసాన్ని విరమించే ముందు సరస్వతి దేవిని పూజించాలి.అలాగే ఆమెకు ఇష్టమైన పండు రేగును తిని ఉపవాసం విరమించాలి.

ఉపవాసం విరమించాక సరస్వతీ దేవికి నైవేద్యంగా పెట్టిన ఆహారాన్ని అందరికీ పంచాలి.ఇక ఆ రోజున పసుపు, మిఠాయిలు, కుంకుమపువ్వుతో( Turmeric, Sweets, Saffron ) చేసిన పసుపు అన్నం తినాల్సి ఉంటుంది.

"""/" / ఈ ఉపవాసం సమయంలో తీపి అన్నం, మాల్ పూవా, బూందీ లడ్డూలు, కళానుగున పండ్లు మొదలైనవి తినవచ్చు.

అయితే ఆ రోజున ఉపవాసం ఉన్నప్పుడు తామసిక వస్తువులు అస్సలు తినకూడదు.అలాగే ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి కూడా వాడకూడదు.

ఇక ఈరోజున సాత్విక ఆహారాన్ని తినాల్సి ఉంటుంది.స్పైసీ ఫుడ్ తినడం కూడా మానుకోవాలి.

వసంత పంచమి రోజున సరస్వతి తల్లి ఖచ్చితంగా ఒక వ్యక్తి పెదవులపై కనిపిస్తుందని చెబుతారు.

కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు శుభకరమైన మాటలు మాత్రమే ఉపవాసం ఉన్నప్పుడు మాట్లాడాలి.

అప్పుడు కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ కు వెళ్లనన్న విష్ణుప్రియ.. ఇప్పుడు మాత్రం ట్విస్ట్ ఇచ్చారుగా!