నోటరీ దస్త్రాల ఆధారంగా జరిగిన స్థలాల కొనుగోలు ఒప్పందాలను క్రమబద్ధీకరించేందుకు నిబంధనలు ఇవే

రాజన్న సిరిసిల్ల జిల్లా: నోటరీ దస్తావేజుల ద్వారా స్థలాలు కొనుగోలు చేసినవారు మీ- సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

125 చ.గజాల లోపు స్థలానికి ఎటువంటి స్టాంపు డ్యూటీ ఉండదు.

ఆపై ఉన్న విస్తీర్ణానికి మార్కెట్ ధరను వర్తింపజేస్తారు.గరిష్ఠంగా మూడు వేల చ.

గజాలలోపు స్థలాల నోటరీలను మాత్రమే క్రమబద్ధీకరిస్తారు.దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించి, వాటిని 22ఏ- ప్రభుత్వానికి చెందినవి, ఇతర ఆస్తులు అనే రెండు రకాలుగా విభజిస్తారు.

దీనిపై తుది నిర్ణయాధికారం కలెక్టర్ దే ఉంటుంది.ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన నోటరీలైతే 58, 59 జీవోల కిందకు చేర్చి క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తారు.

దరఖాస్తులతో నోటరీ దస్త్రాలు, లింకు డాక్యుమెంట్లు, ఆస్తి పన్ను రసీదు, విద్యుత్ వినియోగ రసీదు, నీటి పన్ను రసీదు, ఇతరత్రా ఆధారాలను జతచేయాల్సి ఉంటుంది.

ఈ అవకాశాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదన కలెక్టర్ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు మూడోతరం వారసుడు.. అవ్రామ్ లుక్ పై విష్ణు ఎమోషనల్ పోస్ట్!