పార్లమెంట్ లో టీఆర్ఎస్ హడావుడి ! అసలు ప్లానేంటి ?

పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు దూకుడు ప్రదర్శిస్తున్నారు.వడ్ల కొనుగోళ్లపై బీజేపీ   ప్రభుత్వ తీరును తప్పుపడుతూ,  పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తప్పుపడుతూ,  ఆందోళన నిర్వహిస్తూ,  సభా కార్యక్రమాలను స్థంబింప  చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కొద్ది రోజులుగా ఇదే తంతు పార్లమెంటులోనూ,  రాజ్యసభలో కొనసాగిస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

  ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చూపిస్తోందని టీఆర్ఎస్ ఎంపీలు మండిపడుతున్నారు.

రైతులకు మేలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని పట్టుబడుతున్నారు.ఎంపీలతో పాటు,  కేసీఆర్ సైతం బీజేపీ పెద్దలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

టీఆర్ఎస్ కేంద్రంపై విరుచుకుపడుతూ విమర్శలు చేస్తుండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి అనేక విషయాల్లో టీఆర్ఎస్ సహకరిస్తునే వచ్చింది.

అయితే ఒక్కసారిగా బీజేపీ పై ఈ స్థాయిలో టీఆర్ఎస్ దూకుడు   పెంచుతుందని ఎవరూ ఊహించలేకపోయారు ఒకవైపు కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండగా, రాజ్యసభ సభ్యుడు సీనియర్ పొలిటిషన్ కె.

కేశవరావు తాము బీజేపీకి పూర్తిగా వ్యతిరేకమంటూ ప్రకటించేశారు.ఇక 12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ విపక్ష పార్టీలు పార్లమెంట్ లో నిరసన తెలియజేస్తుండగా, అందులో టీఆర్ఎస్ ఎంపీలు పాల్గొంటున్నారు.

  ఇక తాము అన్ని విషయాల్లోనూ కేంద్రంతో పోరాటం చేస్తున్నాం  అని,  తమకు కలిసి వచ్చే అన్ని పార్టీలతో కలిసి పోరాడుతాం అంటూ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు చెప్పుకొచ్చారు.

"""/" / అయితే పార్లమెంటులోనూ,  రాజ్యసభలోనూ టీఆర్ఎస్ ఈ దూకుడు ప్రదర్శించడం వెనుక కారణాలు చాలా ఉన్నాయట.

  జాతీయ స్థాయిలో          టీఆర్ఎస్ ను ఫోకస్ చేసేందుకు కేసీఆర్ గత కొద్దిరోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

  ఇప్పుడు బీజేపీ వ్యతిరేక పోరాటాలు చేయడం ద్వారా , అనేక ప్రాంతీయ పార్టీలను , బీజేపీ వ్యతిరేక పార్టీ లను ఏకం చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని,  దాని ద్వారా యూపీఏ,  ఎన్డీఏ లకు ప్రత్యామ్నాయ ఫ్రంట్ లోకి వాటిని తీసుకు వచ్చే ఛాన్స్ ఉంటుందని,  అప్పుడు తాము కీలకం అవుతామనే లెక్కల్లో కేసీఆర్ ఉన్నారట.

"""/" / అందుకే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయాన్ని కేసిఆర్ చాలా సీరియస్ గా తీసుకుని ఒక్కసారిగా రాజకీయాన్ని జాతీయస్థాయిలో వేడిక్కించే పనిలో పడ్డారు.

ఇప్పటివరకు బీజేపీ విషయంలో టీఆర్ఎస్ సానుకూలంగా ఉందనే సంకేతాలు అందరిలో ఉండడంతో , దానిని పోగొట్టేందుకు ఈ ఎత్తుగడ వేశారు అనే విషయాలు బయటకి వస్తున్నాయి.

Lakshmi Pranathi , Ntr : ఇద్దరి పుట్టినరోజు ఒకే రోజేనా.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!