పుష్ప 2 కేరళలో ప్లాప్ అవ్వడానికి కారణాలు ఇవే…

పుష్ప 2 సినిమా( Pushpa 2 Movie ) పాన్ ఇండియాలో భారీ విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.

అయితే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని రాబడుతూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో కేరళలో( Kerala ) మాత్రం ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది.

మల్లు అర్జున్ గా అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇంతకుముందు చేసిన అన్ని సినిమాలతో మంచి విజయాలను సాధించాడు.

ఇక్కడ పెద్దగా ఆడని సినిమాలు సైతం అక్కడ మంచి విజయాలను సాధించిన సందర్భాలు ఉన్నాయి.

మరి అలాంటి అల్లు అర్జున్ ( Allu Arjun )చేసిన పుష్ప 2 సినిమా ఎందువల్ల ఆడడం లేదు.

ఆయన అనుకున్నట్టుగా ఈ సినిమాను తెరకెక్కించలేకపోయారా? కాబట్టే కేరళలో ఈ సినిమా డిజాస్టర్ మూటగట్టుకుందా మల్లు అర్జున్ కి అక్కడ భారీ క్రేజ్ అయితే ఉంది.

మరి అలాంటి పుష్ప 2 సినిమా ఎందుకు అక్కడ ఆడలేదు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

"""/" / నిజానికి ఈ సినిమాలో మలయాళ నటుడు అయిన ఫహాడ్ ఫాజిల్ ( Fahad Fazil )క్యారెక్టర్ ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అని అందరూ ఊహించుకున్నారు.

కానీ వాళ్ళ ఊహలకు గండి కొడుతూ సుకుమార్ ఆయన పాత్రలో పెద్దగా వైవిధ్యం ఏమీ లేకుండా విలనిజం కూడా పండించకుండా కామెడీ క్యారెక్టర్ ను నడిపించినట్టుగా నడిపించాడు.

"""/" / తద్వారా ఆ సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడికి తమ హీరోను సరిగ్గా చూపించలేదని మన నటుడిని తక్కువ చేసి చూపించారనే ఒక భావన ఉండడంతోనే వాళ్ళు ఈ సినిమాని చూడకుండా రిజెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరి మొత్తానికైతే పుష్ప 2 సినిమా కేరళలో మంచి విజయాన్ని సాధిస్తుంది అనుకున్న మేకర్స్ కి ఒక రకంగా భారీ దెబ్బ పడిందనే చెప్పాలి.

ఆ నటుడి టాలెంట్ చూసి గోల్డ్ కాయిన్ ఇచ్చేసిన సూర్య.. గ్రేట్ అంటూ?