నవ గ్రహాలను దర్శించుకోవడానికి ఉండే విధివిధానాలు ఇవే..!

జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం మానవ జీవితం పై నవగ్రహాలు కచ్చితంగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి.

ఈ నవగ్రహాల ప్రభావం ప్రకారం శుభ మరియు శుభ ఫలితాలు మానవునికి కలుగుతూ ఉంటాయి.

ఆశుభ ఫలితాలు కలిగేటటువంటి మానవుడు తన జీవితంలో ఆ శుభ ఫలితాలను తగ్గించుకొని శుభ ఫలితాలను పొందడం కోసం నవగ్రహ ఆరాధన చేయడం ఎంతో మంచిదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

పండితులు చెప్పిన దాని ప్రకారం ఏ వ్యక్తి అయినా నవగ్రహాలను పూజించుకోవాలి.అంటే దానికి ఒక విధి విధానం కచ్చితంగా ఉంటుంది.

నవగ్రహమూర్తులు దేవాలయాలలో ఉంటాయి.విశేషంగా శివాలయాలలో నవగ్రహమూర్తులు, నవగ్రహ మండపం ఉంటాయి.

"""/" / ఇలా నవగ్రహాలను దర్శించుకోవడానికి దేవాలయంలోనికి ప్రవేశించినప్పుడు ముందు నవగ్రహాలను దర్శించి ఆఖరిలో గర్భాలయంలో ఉన్న మూలవిరాట్ ను దర్శించుకుని వెళ్లడం నవగ్రహ దర్శ( Navagrahas)న విధివిధానమనీ పండితులు చెబుతున్నారు.

నవగ్రహాలను దర్శించేటప్పుడు ఇంటిలో తలస్నానం చేసి బయలుదేరడం, నవగ్రహాల చుట్టూ 9 లేదా 11 ప్రదక్షిణలు చేయడం ఉత్తమ విధానం అని పండితులు చెబుతున్నారు.

కొన్ని సందర్భాలలో ఇలా చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణలు చేయడం మంచిది.

నవగ్రహాల ప్రదక్షిణ చేసిన తర్వాతే మిగిలిన దేవాలయాల ప్రదక్షిణ చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు.

"""/" / నవగ్రహాలకు ఆది నాయకుడు అయిన సూర్యున్ని( LORD SURYA ) ఆ తర్వాత చంద్రుడు, కుజుడు, బుధుడు, గురు, శుక్రుడు, శని, రాహు, కేతువులు ఇలా వీరిని దర్శించుకుంటూ వారి యొక్క సూత్రాలను, నామాలను పాటిస్తూ భక్తిశ్రద్ధలతో నవగ్రహ ప్రదక్షిణలు చేయడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు.

ఇలా నవగ్రహ దర్శనమైన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఆలయంలో మూలవిరాట్ ను దర్శించి తీర్థ ప్రసాదం వంటివి స్వీకరించి ఇంటికి వెళ్లడం మంచిదని చెబుతున్నారు.

నవగ్రహ దేవాలయాలను దర్శించుకున్న రోజు ప్రదక్షిణలు ఆచరించిన రోజు ఆహార విషయాలలో నియమాలు పాటించాలి.

స్వతిక ఆహారం తీసుకోవడం మరియు దైవచింతనతో ఉండడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.

ఫస్ట్ వీక్ కలెక్షన్లతో ఆ రికార్డును సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఏమైందంటే?