స్టార్ హీరో ప్రభాస్ కే ఎందుకిలా.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైనా ఆ లోటు ఉండిపోయిందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో ప్రభాస్ కు( Prabhas ) మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో క్రేజ్ ఉండగా ప్రభాస్ నటించిన సలార్ కానీ ప్రభాస్ నటించిన కల్కి కానీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్ గా నిలిచాయో సక్సెస్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే సలార్,( Salaar ) కల్కి( Kalki ) హిట్ గా నిలిచినా ఈ సినిమాల సీక్వెల్స్ మాత్రం వేర్వేరు కారణాల వల్ల అంతకంతకూ ఆలస్యమవుతున్నాయి.

ఈ రెండు సినిమాలు అంతకంతకూ ఆలస్యం అవుతుండటం ఫ్యాన్స్ ను ఒకింత బాధ పెడుతోంది.

స్టార్ హీరో ప్రభాస్ సినిమాలకే ఎందుకు ఈ విధంగా జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ప్రభాస్ సైతం తన సినిమాల సీక్వెల్స్ విషయంలో గందరగోళానికి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

ప్రభాస్ ఈ కామెంట్స్ పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. """/" / ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్( The Rajasaab ) సినిమాపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.

అక్టోబర్ చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేలా మేకర్స్ ప్లాన్ ఉందని సమాచారం అందుతోంది.

ది రాజాసాబ్ సినిమాలో కామెడీకి ప్రాధాన్యత ఉంటుందని భోగట్టా.ప్రభాస్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఫిదా చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

"""/" / ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 నుంచి 140 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.

ప్రభాస్ సినిమాలు కలెక్షన్ల పరంగా కూడా అదరగొడుతున్నాయనే సంగతి తెలిసిందే.ప్రభాస్ సినిమాలు అద్భుతమైన కథాంశాలతో తెరకెక్కుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.

స్టార్ హీరో ప్రభాస్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో ఉండగా ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటూ ఉండటం ఈ హీరోకు ఎంతగానో ప్లస్ అవుతోందని చెప్పవచ్చు.

దసరా సినిమాలకు భారీ షాకిచ్చిన తుఫాన్.. దేవరపై కూడా ఎఫెక్ట్ పడిందా?