చనిపోయే ముందు రావణుడు లక్ష్మణుడికి చెప్పిన నీతి సూత్రాలు ఇవే..!

భారతీయులకు ఎంతో పవిత్రమైన గ్రంథాలలో రామాయణం ఒకటని చెప్పవచ్చు.రామాయణంలోని ప్రతి సన్నివేశం, ప్రతి భాగం మనకు ధర్మాన్ని ,నీతిని బోధిస్తుంది.

ధర్మం ప్రకారం మనుషులు ఏ విధంగా నడుచుకోవాలో అద్దం పట్టే విధంగా రామాయణం మనకు తెలియజేస్తుంది.

రామాయణంలో శ్రీ రాముడునీ మొదలుకొని ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో కొంత మన జీవితం పై ప్రభావం చూపిస్తుంటాయి.

రామాయణంలో రావణాసురుడి ఒక రాక్షసుడుగా భావిస్తారు. """/" / నిజానికి బుద్ధి పరంగా రావణుడు కూడా ఎంతో మంచివాడు.

కానీ స్త్రీ బలహీనత వల్ల రావణాసురుడు మరణం పొందాడు.ఈ సృష్టిలో రావణాసురుడికి మించిన పరమ భక్తుడు ఎవరు లేరని చెప్పవచ్చు.

ఎన్నో సంవత్సరాలు తరబడి తపస్సు చేయడం వల్ల ఎంతో జ్ఞానాన్ని పొందిన రావణాసురుడు సీతాపహరణ తరువాత శ్రీరాముడి చేతిలో మరణం పొందాడు.

మరణం పొందుతూ రావణాసురుడు కొన్ని నీతి సూత్రాలను లక్ష్మణుడికి తెలియజేశాడు.అవి ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

"""/" / Ul Li Style="list-style-type: None" Ul Liఎల్లప్పుడు నీ పక్కనే ఉంటూ నిన్ను విమర్శించే వారిని నెత్తిన పెట్టుకో, కానీ.

నిన్ను పొగిడే వారిని మాత్రం నమ్మొద్దని తెలియజేశాడు./li Liఎప్పుడు విజయం సాధిస్తున్నారు కదా అని విర్రవీగకూడదు.

గెలుపు ఎప్పుడు ఒకరి సొంతం కాదు./li Liయుద్ధంలో గెలవాలనే కోరిక ప్రతి ఒక్క రాజుకు ఉండాలి.

యుద్ధంలో సైన్యానికి కూడా అవకాశం ఇచ్చి వారితో పాటు రాజు కూడా అలుపెరగకుండా శ్రమిస్తేనే యుద్ధంలో గెలుస్తారు.

/li Liరథసారధి, వంట చేసే వాడిని, కాపలా ఉండే వారితో ఎప్పుడు శత్రుత్వం పెట్టుకోకూడదు.

అలాంటి శతృత్వం వల్ల ఎప్పుడైనా ప్రాణాలకు ప్రమాదం వాటిల్లవచ్చు./li Liనీ శత్రువు చిన్నవాడు అని అనుకుని తక్కువ అంచనా వేయకూడదు.

ఆంజనేయుడు విషయంలో నేను తక్కువ అంచనా వేయటం వల్ల మరణం పొందుతున్నానని రావణాసురుడు లక్ష్మణుడికి బోధించాడు.

/li /ul /li /ul """/" / Ul Liదేవుడిని ప్రేమించు లేదా ద్వేషించు కాని దేవుడు పట్ల ఎల్లప్పుడు దృఢనిశ్చయంని కలిగి ఉండు.

/li /ul ఈ విధంగా రావణాసురుడు యుద్ధంలో చనిపోయే ముందు లక్ష్మణుడికి ఈ మాటలను చెబుతూ ప్రాణాలు విడిచాడు.

ఆరోజు రావణాసురుడు చెప్పిన మాటలు నేటి మన జీవితానికి ఎంతో చక్కగా వర్తిస్తాయి అని చెప్పవచ్చు.

దేవర 100 డేస్ సెంటర్ల లెక్క ఇదే.. వామ్మో అన్ని థియేటర్లలో 100 రోజులు ఆడిందా?