చ‌లికాలంలో గ‌ర్భిణీలు తీసుకోవాల్సిన అద‌న‌పు జాగ్ర‌త్త‌లు ఇవే!

చ‌లి కాలం ప్రారంభం అయింది.ఈ సీజ‌న్‌లో ఆరోగ్యం విష‌యంలో ఏ మాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా ఏదో ఒక అనారోగ్య స‌మ‌స్య చుట్టు ముట్టేస్తుంది.

ముఖ్యంగా గ‌ర్భిణీ స్త్రీలు మిగిలిన సీజ‌న్ల‌తో పోలిస్తే చ‌లి కాలంలో అద‌నంగా మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

మ‌రి ఆ జాగ్ర‌త్త‌లు ఏంటీ.? ఎందుకు తీసుకోవాలి.

? వంటి విష‌యాలను ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు చూసేద్దాం. """/" / గ‌ర్భిణీ స్త్రీల‌లో మామూలుగానే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది.

ఇందుకు చ‌లికాలం తోడైతే.ఇమ్యూనిటీ సిస్ట‌మ్ మ‌రింత వీక్ అయిపోతుంది.

దాంతో ర‌క‌ర‌కాల వైర‌స్‌లు, ఇన్ఫెక్ష‌న్లు తీవ్రంగా ఇబ్బంది పెడ‌తాయి.అందుకే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు మంచి ఆహారం తీసుకోవాలి.

సిట్ర‌స్ ఫ్రూట్స్‌, న‌ట్స్‌, డ్రై ఫ్రూట్స్‌, పాలు, పాలు ప‌దార్థాలు, గుడ్డు, చేప‌లు, ఆకు కూర‌లు వంటివి డైట్‌లో చేర్చుకుంటే రోగ నిరోధక వ్య‌వ‌స్థ స్ట్రోంగ్‌గా మారుతుంది.

అలాగే చ‌లి కాలం స్టార్ట్ అవ్వ‌గానే కొంద‌రు నీటిని తాగ‌డం త‌గ్గించేస్తారు.కానీ, ఈ సీజ‌న్‌లో గ‌ర్భిణీలు స‌రిగ్గా నీటిని తీసుకోకుంటే.

డీహైడ్రేష‌న్ ఏర్ప‌డి త‌ల్లితో పాటు క‌డుపులోని బిడ్డ కూడా రిస్క్‌లో ప‌డుతుంది.చ‌లికాలంలో గ‌ర్భిణీలు పాల‌ల్లో కుంకుమ పువ్వు క‌లిపి తీసుకోవాలి.

త‌ద్వారా శరీర ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు ఏర్ప‌డ‌కుండా ఉంటాయి. """/" / చలికాలంలో వ్యాయామాలు చేయాలంటే ఎవరికైనా బద్ధకంగానే ఉంటుంది.

కానీ, క‌డుపులోని బిడ్డ ఎదుగుద‌ల బాగుండాలంటే గ‌ర్భిణీలు ఖ‌చ్చితంగా వ్యాయామాలు చేయాలి.ముఖ్యంగా వాకింగ్, ప్రాణాయామం వంటి వ్యాయామాలను చేయ‌డం వ‌ల్ల అనేక స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండొచ్చు.

ఇక గ‌ర్భిణీ స్త్రీలు ఏవి ప‌డితే అవి కాకుండా చ‌లి కాలానికి అనుగుణంగా దుస్తులు ధరించాలి.

చ‌ర్మానికి రెగ్యుల‌ర్‌గా మాయిశ్చ‌రైజ‌ర్ అప్లై చేసుకోవాలి.త‌ద్వారా చ‌ర్మం పొడి బార‌డం, దుర‌ద‌లు వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

Foot Pain : పాదాలలో నొప్పిని నిర్లక్ష్యం చేయకండి.. చేస్తే మాత్రం..!