దంతాల ఆరోగ్యానికి తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

దంతాలు( Teeth ) ఆరోగ్యంగా ఉండాలని, తెల్లగా మెరిసిపోతూ కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.

కానీ దంతాల విషయంలో చాలా మంది అశ్రద్ధగా వ్యవహరిస్తుంటారు.ఫలితంగా అనేక దంత సమస్యలను ఎదుర్కొంటారు.

ఈ నేపథ్యంలోనే దంతాల ఆరోగ్యానికి తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

రోజుకు కనీసం రెండుసార్లు మీ దంతాలను బ్రష్ చేయండి.మీ దంతాల మధ్య నుండి ఫలకం మరియు ఆహారాన్ని తొలగించడానికి రోజుకు ఒకసారి ఫ్లాస్ చేసుకోవాలి.

కఠినమైన టూత్ బ్రష్ లను ఉపయోగించరాదు.ప్రతి 3 నుండి 4 నెలలకు ఒకసారి మీ టూత్ బ్రష్‌ ను మార్చాలి.

అలాగే ధూమపానం మీ చిగుళ్ల వ్యాధి, దంతాల నష్టం మరియు నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

అందువల్ల ధూమపానం అలవాటు ఉంటే మానుకోండి.టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం దంతాలకు హానికరం.

చక్కెర పదార్థాలు, జంక్ ఫుడ్‌ కూడా దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.వాటికి బదులుగా తాజా కూరగాయలు, పండ్లు తీసుకోండి.

క్యారెట్, స్ట్రాబెర్రీ, పాలు, పెరుగు, నట్స్, పాలకూర, చేపలు( Carrots, Strawberries, Milk, Yogurt, Nuts, Lettuce, Fish ) వంటి ఆహారాలు దంతాలను దృఢంగా మారుస్తాయి.

అలాగే ఆరోగ్యమైన తెల్లటి మెరిసే దంతాల కోసం రెండు టేబుల్ స్పూన్లు ఆవ నూనెలో పావు టీ స్పూన్ ఉప్పు కలిపి దంతాలను రెండు నిమిషాల పాటు తోముకోండి.

ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోండి.ఈ విధంగా చేస్తే దంతాలు ముత్యాల్లా మారతాయి.

"""/" / దంతాల పసుపుదనం పోవాలంటే రెండు టేబుల్ స్పూన్లు యాపిల్ సైడర్ వెనిగర్ కు రెండు టేబుల్ స్పూన్లు వాటర్ మిక్స్ చేయాలి.

ఈ ద్రావణం తో రెండు నుంచి ఐదు నిమిషాల పాటు నోటిని పుక్కిలించాలి.

ఆపై నోటిని క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఇలా చేస్తే దంతాలపై పసుపు మరకలు పోతాయి.

"""/" / కొబ్బరి నూనె అనేది మీ దంతాలను ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడే సహజమైన డిటాక్సిఫైయింగ్ ఏజెంట్ గా ప‌నిచేస్తుంది.

కాబట్టి యాపిల్ సైడర్ వెనిగర్ కు బదులుగా కొబ్బరి నూనెతో అయినా నోటిని పుక్కిలించొచ్చు.

ఆయిల్ పుల్లింగ్ నోటిలో హానికరమైన బ్యాక్టీరియాను అంతం చేస్తుంది.దంత క్షయం మరియు కావిటీలను నిరోధిస్తుంది.

భారతీయులకు ఇజ్రాయెల్ గుడ్‌న్యూస్ .. అందుబాటులోకి ‘ఈ-వీసా’, దరఖాస్తు ఎలా అంటే?