భారతదేశంలో అత్యంత పేద రాష్ట్రాలు ఇవే: నివేదిక

కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడ్డారు.మధ్యతరగతి ప్రజలు కూడా ఉపాధి కోల్పోయి, కరోనా బారినపడి పేదరికంలోకి జారుకున్నారు.

కరోనా మన భారతదేశం పై కూడా తీవ్ర ప్రభావం చూపింది.ఫస్ట్, సెకండ్ వేవ్ లు కరాళ నృత్యం చేసిన వేళ లక్షలాది మంది ఆర్థికంగా దిగజారిపోయారు.

అయితే భారతదేశంలోని పేదల సంఖ్యను తెలియజేసేందుకు నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ (MPI) తాజాగా ఒక నివేదిక రూపొందించింది.

తొలిసారిగా రాష్ట్రాలవారీగా నిరుపేదల సంఖ్యను నీతి అయోగ్ వెల్లడించింది.బహుముఖ పేదరిక సూచీ నివేదిక ప్రకారం బిహార్‌ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా.

అంటే 51.91 శాతం మంది ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు.

జార్ఖండ్‌లో 42.16 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 37.

79 శాతం, మధ్యప్రదేశ్ లో 36.65, మేఘాలయలో 32.

67 శాతం మంది ప్రజలు నిరుపేదలుగా మారిపోయారు.దాంతో అత్యంత పేద రాష్ట్రాలుగా బిహార్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ నిలిచాయి.

"""/" / దేశంలో అతి తక్కువ నిరుపేదలతో కొన్ని రాష్ట్రాలు ఆశ్చర్యపరుస్తున్నాయి.కేరళ రాష్ట్ర జనాభాలో కేవలం 0.

71 శాతం మంది ప్రజలు మాత్రమే పేదరికంతో బాధ పడుతున్నారు.గోవాలో 3.

76 శాతం, సిక్కింలో 3.82 శాతం, తమిళనాడులో 4.

89 శాతం, పంజాబ్‌ లో 5.59 శాతం మంది నిరుపేదలు ఉన్నారు.

దాంతో అత్యంత తక్కువ పేదవారు ఉన్న రాష్ట్రాలుగా కేరళ, గోవా, సిక్కిం, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలు నిలిచాయి.

"""/" / ఇక కేంద్ర పాలిత ప్రాంతాల విషయానికొస్తే.దాద్రానగర్‌ హవేలిలో 27.

36 శాతం, జమ్మూకశ్మీర్, లద్ధాఖ్‌లో 12.58 శాతం, డయ్యూ డామన్‌లో 6.

82 శాతం, చతీస్ గఢ్‌లో 5.97 శాతం అంటే ప్రజలు పేదరికంలో జీవనం సాగిస్తున్నారు.

పుదుచ్చేరిలో 1.72 శాతం, లక్షద్వీప్‌లో 1.

82 శాతం, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 4.30 శాతం, ఢిల్లీలో 4.

79 శాతం మంది నిరుపేదలు ఉన్నారని నివేదిక తెలియజేసింది.ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పేదవారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది.

తెలంగాణలో 13.7 శాతం మంది పేదరికంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ లో 12.

31 శాతం మంది దారిద్య్రంలో ఉన్నారు.

ఐపీఎల్ 2024: సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోతున్న బ్యాటర్లకు కళ్లెం వేస్తున్న టాప్ బౌలర్లు వీళ్లే..??