క్రెడిట్ కోసం గొడవలు పెట్టుకున్న వాళ్ళు వీళ్లే…

ఒక సినిమా సక్సెస్ అనేది ఆ సినిమా కి పనిచేసిన టీమ్ మీద ఆధారపడి ఉంటుంది డైరెక్టర్ ఎంత మంచి గా డైరెక్షన్ చేసిన కూడా మిగితా క్రాఫ్ట్ వాళ్ళు సరిగ్గా చేయపోతె సినిమా అనేది ప్లాప్ అవుతుంది.

అందుకే ఒక సినిమా హిట్ అనేది హీరో మీద గానీ డైరెక్టర్ మీదగాని ఆధారపడి ఉండదు అదంతా సమిష్టి గా చేసే వర్క్ అనే చెప్పాలి అందుకే ఈ సినిమాల విషయంలో చాలా మంది ఈ విషయాన్ని తెలుసుకోలేక క్రెడిట్ కోసం గొడవలు పెట్టుకుంటు ఉంటారు.

అయితే ఇలానే క్రెడిట్ ఇవ్వకపోవడం వల్ల గొడవలు పెట్టుకున్న వ్యక్తులు ఎవరు ఆ సినిమాలు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం.

ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది డైరెక్టర్లు( Directors ) వాళ్ళు చేసిన సినిమాల గురించి సినిమాలో ఉన్న ప్రతి సీన్ గానీ అన్ని నా క్రియేటివిటీ నే అని చెప్పుకుంటూ తిరుగుతారు.

అయితే రీసెంట్ గా వచ్చిన నాగ శౌర్య ( Naga Shaurya )ఛలో సినిమా విషయం లో కూడా ఇదే జరిగిందే డైరెక్టర్ వెంకీ కుడుముల( Director Venky Kudumula ) తీసిన ఈ సినిమా మంచి విజయం సాధించింది ఇక ఈ సినిమా సక్సెస్ తర్వాత నాగశౌర్య ఈ సినిమా స్టోరీ నాది అని చెప్పాడు అప్పుడు డైరెక్టర్ లేదు ఈ సినిమా స్టోరీ నేను రాసుకుంది అని చెప్పాడు అలా వాళ్లిద్దరి మధ్య చాలా పెద్ద గొడవే జరిగింది.

"""/" / ఇక వీళ్లే కాకుండా కొన వెంకట్ ( Kona Venkat )కూడా ఇలాంటి ప్రాబ్లం ని ఎదురుకున్నాడు ఎలా అంటే ఈయన చేసిన సినిమాల్లో ఎక్కువ స్టోరీ లు శ్రీను వైట్ల గారికే రాసారు.

అయితే ఆయన ప్రతి సినిమాలో రైటర్ గా కొన వెంకట్ పేరు వేసి కథ మాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ మాత్రం శ్రీను వైట్ల అని తన పేరు వేయించుకునే వాడు ఇదంతా కొన వెంకట్ కి నచ్చాక శ్రీను వైట్ల ( Srinu Whitela )కాంపౌండ్ నుంచి బయటికి వచ్చేశాడు.

"""/" / ఇక సినిమా ఇండస్ట్రీ లో ఉన్న బోయపాటి శ్రీను( Boyapati Srinu ) లాంటి డైరెక్టర్ కూడా ఇండస్ట్రీ లో మంచి సూపర్ హిట్ సినిమాలు తీసాడు.

అయితే ఆయన చేసిన మొదటి సినిమా అయిన భద్ర సినిమాకి స్టోరీ, డైలాగ్స్ రెండు కూడా కొరటాల శివ( Koratala Shiva ) రాస్తే అందులో స్టోరీ డైలాగ్స్ అని ఉన్న రెండింటిలో ఒకటి మాత్రమే నీకు క్రిడిట్ ఇస్తా మిగితది నేను వేసుకుంటా అని చెప్పాడట దాంతో అది ఫస్ట్ సినిమా కాబట్టి ఏం చేయలేక కొరటాల శివ సరే అన్నాడట అయితే ఇదే సీన్ సేమ్ సింహ సినిమా టైం లో కూడా జరిగితే దానికి కొరటాల ఒప్పుకోక ఆ సినిమా నుంచి బయటికి వచ్చేశాడు అంటా.

ఇక దాంతో బోయపాటి శ్రీను ఆయనకి అసలు క్రెడిట్ ఏం ఇవ్వకుండా ఆయన పేరే వేయించుకున్నారు.

ఇక దీని వల్లే తాను డైరెక్టర్ గా మారానని కొరటాల చాలా సందర్భాల్లో చెప్పారు.

ఈ ఇయర్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో భారీ సక్సెస్ అయిన సినిమాలు ఇవేనా..?