ముఖ చ‌ర్మాన్ని ప్ర‌కాశ‌వంతంగా మార్చే మాన్‌సూన్ ఫేస్ ప్యాక్స్ ఇవే!

ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో ఆరోగ్యాన్నే కాదు చ‌ర్మాన్ని సంర‌క్షించుకోవ‌డం కూడా అత్యంత క‌ష్ట‌త‌రంగా మారుతుంటుంది.

ఎంత కేర్ తీసుకున్నా.ఏదో ఒక చ‌ర్మ స‌మ‌స్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

అయితే ఈ మాన్‌సూన్‌లో ఇప్పుడు చెప్ప‌బోయే ఫేస్ ప్యాక్స్‌ను ట్రై చేస్తే.మీ ముఖ చ‌ర్మం అందంగా, ప్ర‌కాశ‌వంతంగా మార‌డం ఖాయం.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ ఫేస్ ప్యాక్స్ ఏంటో.వాటిని ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల దానిమ్మ గింజ‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ ఓట్స్‌, రెండు టేబుల్ స్పూన్ల మ‌జ్జిగ‌, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె వేసి మెత్త‌టి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.ప‌దిహేను నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.

అనంత‌రం వేళ్ల‌తో స్మూత్‌గా ర‌బ్‌ చేసుకుంటూ గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

రెండు రోజుల‌కు ఒక‌సారి ఈ విధంగా చేస్తే మ‌చ్చ‌లు, మొటిమ‌లు, మృత క‌ణాలు పోయి ముఖ చ‌ర్మం గ్లోయింగ్‌గా, ఎట్రాక్టివ్‌గా మారుతుంది.

"""/" / అలాగే మ‌రో ప్యాక్ ఏంటంటే.ఒక అర‌టి పండును తీసుకుని తొక్క తొల‌గించి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఈ ముక్క‌ల‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఈ అర‌టి పండు పేస్ట్‌లో రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్నీ క‌లిసేంత వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఏదైనా బ్ర‌ష్ సాయంతో ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని.

ఒక ఇరవై నిమిషాల పాటు రిలాక్స్ అయిపోవాలి.ఆపై నార్మ‌ల్ వాట‌ర్ తో ఫేస్‌ను క్లీన్ చేసుకోవాలి.

ఈ ప్యాక్ ను త‌ర‌చూ ట్రై చేయ‌డం వ‌ల్ల‌ ముఖంలో కొత్త కాంతి సంత‌రించుకుంటుంది.

మ‌రియు చ‌ర్మం స్మూత్‌గా త‌యార‌వుతుంది.