తలనొప్పిగా ఉన్నప్పుడు అస్సలు చేయకూడని తప్పులు ఇవే!

మనల్ని చాలా కామన్ గా వేధించే సమస్యల్లో తలనొప్పి ముందు వరుసలో ఉంటుంది.

బిజీ లైఫ్ స్టైల్, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, పలు రకాల మందుల వాడకం, అతిగా మద్యం సేవించడం తదితర కారణాల వల్ల తలనొప్పి(Headache) ఇబ్బంది పెడుతుంటుంది.

అయితే తలనొప్పిగా ఉన్నప్పుడు తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు.ఆ తప్పుల కారణంగా నొప్పి మరింత తీవ్రతరం గా మారుతుంది.

ఈ నేపథ్యంలోనే తలనొప్పిగా ఉన్నప్పుడు అస్సలు చేయకూడని తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తలనొప్పిగా ఉన్నా సరే కొందరు స్మార్ట్ ఫోన్ (Smart Phonte)ను ఉపయోగించడం, కంప్యూటర్(Computer) ముందు కూర్చుని పని చేయడం చేస్తుంటారు.

ఇలా చేయడం వల్ల తలనొప్పి అస్సలు తగ్గకపోగా మరింత పెరుగుతుంది.అందువల్ల తలనొప్పిగా ఉన్నప్పుడు చేసే పని నుంచి కాస్త విశ్రాంతి తీసుకోండి.

స్మార్ట్ ఫోన్ ను పక్కన పెట్టండి. """/" / అలాగే తలనొప్పిగా ఉన్నప్పుడు కొందరు రిలీఫ్ కోసం చూయింగ్ గమ్ నమ్ముతుంటారు.

దీనివల్ల సమస్య మరింత అధికమవుతుంది.తలనొప్పిగా ఉన్నప్పుడు గట్టిగా ఉండే పదార్థాలు(Hard Materials) తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

తలనొప్పి వేధిస్తున్నప్పుడు కొందరు బ్రేక్ ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్ ని స్కిప్ కొడుతూ ఉంటారు.

ఇది సరైన పద్ధతి కాదు.తలనొప్పిగా ఉన్నప్పుడు లైట్ ఫుడ్ ను తీసుకుని రెస్ట్ తీసుకుంటే త్వరగా రిలీఫ్ పొందుతారు.

భోజనాన్ని దాటవేయడం వల్ల తలనొప్పి మరింత పెరుగుతుంది.పైగా నీరసం కూడా వస్తుంది.

"""/" / తలనొప్పి ఇబ్బంది పెడుతున్నప్పుడు పొరపాటున కూడా ప్రకాశవంతమైన లైట్లకు మ‌రియు కాంతికి గురికాకూడదు.

ఇలా చేస్తే నొప్పి మరింత పెరుగుతుంది.లైట్ తక్కువ ఉన్న లేదా చీకటి గదిలో(dark Room) విశ్రాంతి తీసుకుంటే తలనొప్పి తొందరగా తగ్గుతుంది.

బిగుతుగా జడ వేసుకున్న శిరోభారం తగ్గదు.కురులని వదులుగా వదిలేస్తే మంచిది.

ఇక తలనొప్పిగా ఉన్నప్పుడు ధ్యానం చేయడం, అల్లం టీ (Ginger Tea)తీసుకోవడం, నుదురు మ‌రియు మెడ ప్రాంతాన్ని సున్నితంగా మర్దన చేసుకోవడం వంటివి చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.