రాజమౌళికి నాగ్ అశ్విన్ కు తేడాలివే.. ఆ విషయాలు జక్కన్నను చూసి నేర్చుకోవాల్సిందే!

స్టార్ డైరెక్టర్ రాజమౌళి( Rajamouli ) తొలి సినిమా స్టూడెంట్ నంబర్ 1 నుంచి ఆర్.

ఆర్.ఆర్ వరకు ఎన్నో భారీ విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

రాజమౌళి తన సినిమాలను అద్భుతంగా మార్కెటింగ్ చేసుకుంటారు.భాషతో సంబంధం లేకుండా ప్రమోషన్స్ తో మ్యాజిక్ చేయడంలో రాజమౌళికి ఎవరూ సాటిరారనే సంగతి తెలిసిందే.

రాజమౌళి తర్వాత ఆ స్థాయి దర్శకుడు నాగ్ అశ్విన్( Nag Ashwin ) చాలామంది భావిస్తున్నారు.

"""/" / అయితే ప్రమోషన్స్ విషయంలో మాత్రం నాగ్ అశ్విన్( Nag Ashwin ) తో పోల్చి చూస్తే జక్కన్నదే పైచేయి అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సినిమాకు హైప్ తీసుకురావడంలో జక్కన్న జక్కన్నే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.నాగ్ అశ్విన్ కూడా ప్రమోషన్స్ చేస్తున్నా రాజమౌళి సినిమాల స్థాయిలో అయితే చేయడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగలేదు. """/" / కొన్ని ఏరియాలలో కల్కి సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలుకావాల్సి ఉంది.

రాజమౌళికి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ పూర్తిస్థాయిలో ఉండటం కొంతమేర ప్లస్ కాగా నాగ్ అశ్విన్ కు స్వప్నా దత్ ( Swapna Dutt )నుంచి మాత్రమే సపోర్ట్ దక్కుతోంది.

భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న కల్కి ఆ అంచనాలను పూర్తిస్థాయిలో అందుకుంటుందో లేదో మాత్రం చూడాల్సి ఉంది.

సరైన ప్రాజెక్ట్ లతో నాగ్ అశ్విన్ తర్వాత సినిమాలతో సైతం భారీ విజయాలను అందుకుంటారేమో చూడాలి.

నిదానంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారని ఈ దర్శకుని గురించి కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్లకు చెక్ పెట్టాల్సిన బాధ్యత సైతం నాగ్ అశ్విన్ పై ఉందని చెప్పవచ్చు.

కల్కి సినిమాతో నాగ్ అశ్విన్ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో చూడాలి.నాగ్ అశ్విన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా కల్కి మూవీ బుకింగ్స్ పరంగా మాత్రం అదరగొడుతోంది.

జుట్టు రాలడం, చుండ్రు రెండింటికి చెక్ పెట్టే ముల్తానీ మట్టి.. ఎలా వాడాలంటే?