జగన్ పాలనకు ఇవే చివరి ఎన్నికలు అచ్చెనాయుడు సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.టీడీపీ కేడర్ మొత్తం కలిసి పని చేస్తే వచ్చే ఎన్నికలలో 160 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని స్పష్టం చేశారు.

చంద్రబాబు ఇటీవల ఇవే తన చివరి ఎన్నికలని చెబితే కొంతమంది పిచ్చి కుక్కల్లాగా మాట్లాడారని.

జగన్ దుర్మార్గపు పాలనకు విముక్తి కలిగించడానికి.ఇవే చివరి ఎన్నికలు అని అన్నట్లు క్లారిటీ ఇచ్చారు.

చంద్రబాబు పరోక్షంగా జగన్ కి చివరి ఎన్నికలు అన్నట్లు పేర్కొన్నారు.టీడీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అచ్చెనాయుడు ఈ రీతిగా వ్యాఖ్యానించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయి.మూడున్నర సంవత్సరాలలో 36 మంది పార్టీ కార్యకర్తలను కోల్పోయినట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతే పట్టించుకోని పోలీసులు సీఎం కటౌట్ తగలబడిన వెంటనే డాగ్ స్క్వేడ్ రంగంలోకి దించారని విమర్శించారు.

పోలీసులు మరి దిగజారిపోయారని మండిపడ్డారు.జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారని విమర్శించారు.

చంద్రబాబు పర్యటనలో రాళ్లు వేస్తున్నారు.ఈ క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన లాభం లేదు అదే ప్లేస్ లో వైసీపీ వాళ్లకు తగిన బుద్ధి చెబుతామంటూ అచ్చెనాయుడు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

కార్చిచ్చు బాధితులకు ఇవాంకా సాయం… స్వయంగా వడ్డించిన ట్రంప్ కుమార్తె