ఈ 2023 ఏడాదిలో పెళ్లి పీటలెక్కిన భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు వీళ్లే..!

ఈ 2023 ఏడాదిలో ఏకంగా భారత జట్టులో ఆడే ఏకంగా 7 మంది ఆటగాళ్లు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.

ఆ ఆటగాళ్లు ఎవరో చూద్దాం.భారత జట్టు యువ బ్యాట్స్ మెన్ రుతురాజ్ గైక్వాడ్, ఉత్కర్ష పవార్ ను జనవరి 3, 2023న వివాహం చేసుకున్నాడు.

ఉత్కర్ష పవార్ కూడా క్రికెటరే కావడం విశేషం.ఆమె మహారాష్ట్ర తరఫున దేశవాళి క్రికెట్ ఆడుతోంది.

భారత జట్టు బ్యాట్స్మెన్ వికెట్ కీపర్ కేఎల్, రాహుల్ కు బాలీవుడ్ నటి అథియా శెట్టి కు జనవరి 23, 2023న వివాహం జరిగింది.

అథియా శెట్టి( Athiya Shetty ) ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె.

ఈ వివాహం గురించి భారతీయులకంతా తెలిసిందే. """/" / భారత జట్టు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్( Axar Patel ) తన స్నేహితురాలైన మేహా పటేల్ ను జనవరి 27, 2023న వడోదర లో వివాహం చేసుకున్నాడు.

భారత జట్టు ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన శార్థూల్ ఠాగూర్ 2021లో మిథాలీ పారుల్కర్ ను నిశ్చితార్థం చేసుకుని, ఫిబ్రవరి 27, 2023న వివాహం చేసుకున్నాడు.

"""/" / భారత జట్టు ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన ప్రసిద్ధ్ కృష్ణ( Prasidh Krishna ), తాను గాయం కారణంగా జట్టుకు దూరమైన సమయంలో జూన్ 8, 2023న రచనను వివాహం చేసుకున్నాడు.

భారత జట్టు యువ పేసర్ ముఖేష్ కుమార్, దివ్య సింగ్ ను నవంబర్ 28, 2023న వివాహం చేసుకున్నాడు.

భారత జట్టుకు చాలా కాలం పాటు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ తన స్నేహితురాలైన స్వాతి ఆస్థాన ను నవంబర్ 24, 2023న వివాహం చేసుకున్నాడు.

ఒకే ఏడాదిలో ఏడు మంది భారత క్రికెటర్లు వివాహ బంధంలోకి అడుగుపెట్టడం జరిగింది.

ఈ విదేశీ మహిళకు బుద్ధి లేదు.. కిరణ్ బేడీ వత్తాసు పలకడమే దారుణం?