ఉగాది రోజు చేయాల్సిన చేయకూడని..ముఖ్యమైన పనులు ఇవే..!

తెలుగు సంవత్సరానికి ఆది ఉగాది అని కచ్చితంగా చెప్పవచ్చు.ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఉగాది పండుగను( Ugadi Festival ) ఎంతో వైభవంగా జరుపుకుంటారు.

బ్రహ్మ ఈ సృష్టిని ఉగాది రోజే ప్రారంభించడాని పురాణాలలో ఉంది.ఉగాది వచ్చింది అంటే ప్రకృతి అందంగా, పచ్చదనంతో మెరిసిపోతుంది.

వసంత కాలంలో చేసుకునే ఈ పండుగ కోసం ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.

ఉగాది రోజు క్రోధి నామ సంవత్సరం( Krodhi Nama Year ) మొదలు అవుతోంది.

ఉగాది పండుగ రోజు చాలామంది తెలియక కొన్ని పనులు చేస్తూ ఉంటారు.ఈ పండుగ రోజు కచ్చితంగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి.

అలాగే చేయకూడని పనులు కూడా ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే ఉగాది పండుగ రోజు కొత్త దుస్తులను కచ్చితంగా ధరించాలి.ఎందుకంటే ఈ రోజే కొత్త సంవత్సరం మొదలవుతుంది.

కొత్త ఏడాది మొదటి రోజు ఎంత ఆనందంగా ఉంటామో, సంవత్సరం అంతా అలానే ఉంటామని పెద్దవారు చెబుతూ ఉంటారు.

కాబట్టి ఉగాది రోజు కచ్చితంగా అందరూ కొత్త దస్తులు వేసుకుంటే మంచిది.అలాగే ఉగాది రోజు ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడిని రుచి చూడాలి.

"""/" / ఈ పచ్చడినీ నవగ్రహాలతో( Navagrahas ) పోలుస్తూ ఉంటారు.నవగ్రహాలలో కొన్ని గ్రహాలకు ఈ పచ్చడిలోని రుచులకు సంబంధం ఉందని చెబుతూ ఉంటారు.

అలాగే ఉగాది పండుగ రోజు అందరూ పంచాంగ శ్రవణం( Almanac Hearing ) చేయాలి.

అయితే పంచాంగ శ్రవణాన్ని ఎలా పడితే అలా కూర్చొని వినకూడదు.దక్షిణ ముఖంగా కూర్చుని పంచక శ్రావణం చేస్తే ఈ సంవత్సరం అంతా వారికి మంచి జరుగుతుంది.

ముఖ్యంగా ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడితో పాటు తీపి నైవేద్యాలతో లక్ష్మీదేవిని ( Goddess Lakshmi )పూజించడం మంచిది.

ఇప్పుడు ఉగాది పండుగ రోజు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. """/" / ఉగాది పండుగ రోజు అర్ధరాత్రి దాకా మేల్కొని ఉదయం చాలా ఆలస్యంగా నిద్ర పోతారు.

ఉగాది రోజు మాత్రం ఉదయాన్నే నిద్ర లేవాలి.సూర్యోదయానికి ముందే లేస్తే ఇంకా మంచిది.

ఈ పండుగ రోజు మద్యం, సిగరెట్, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది.

అలాగే ఇతరులతో గొడవలు అస్సలు పడకూడదు.చిరిగిపోయిన లేదా మసిన దుస్తులను ధరించకూడదు.

అలాగే కచ్చితంగా కుల దైవాన్ని పూజించుకోవాలి.ఉగాది పండుగ రోజు ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

ఆ రోజు మీరు ఎంత ఆనందంగా ఉంటే సంవత్సరం అంతా ఆనందంగా ఉంటారు.

ఈ రెస్టారెంట్‌ మెనూ ప్రపంచంలోనే ఖరీదైనది.. ధర చూస్తే ఫ్యూజులు ఔట్.. ఎక్కడుందంటే..?