జామ పండు వల్ల కలిగే ముఖ్యమైన అనారోగ్య సమస్యలు ఇవే..!

ముఖ్యంగా చెప్పాలంటే జామ పండు( Guava Fruit )లో మన శరీరానికి అవసరమయ్యే చాలా పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు( Health Benefits ) దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో రోగ నిరోధక శక్తిని( Immunity ) పెంచడంలో,చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, ఇంకా కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచడంలో అలాగే రక్తపోటును తగ్గించడంలో జామపండు ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇంకా అలాగే వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు.

గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.ఈ విధంగా జామ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అంతేకాకుండా జామ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. """/" / కొన్నిసార్లు జామ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్,( Gas ) ఇంకా గుండెల్లో మంట వంటి అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది.

ఇంకా అదే విధంగా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో ఈ జామపండు కూడా ఒకటి.

వీటిని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల వీటిలో ఉండే ఫైబర్ కారణంగా మలబద్దకం( Constipation ), అజీర్తి వంటి సమస్యలు వస్తాయి.

ఇంకా చెప్పాలంటే జామ పండును ఎక్కువగా తీసుకోవడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇంకా అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు జామ పండ్లకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది.

ఒక 100 గ్రాముల జామ పండ్లలో 9 గ్రాముల సహజ చెక్కరలు ఉంటాయి.

"""/" / కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో పెరిగే అవకాశం ఉంది.

అందుకే షుగర్ తో బాధపడే వారు జామా పండ్లను తక్కువగా తీసుకోవడమే మంచిది.

అలాగే జామ పండును మధ్యాహ్నం భోజనం తర్వాత లేదా రాత్రి భోజనానికి మధ్యలో తీసుకోవాలి.

అలాగే వీటిని వ్యాయామం చేసిన తర్వాత తీసుకోవడం కూడా మంచిదే.కానీ రాత్రి పూట మాత్రం జమ పండ్లను అస్సలు తినకూడదు.

రాత్రి పూట తీసుకోవడం వల్ల జలుబు ఇంకా ఫ్లూ వంటి సమస్యలు వస్తాయి.

జామ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

కాబట్టి వీటిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

పర్మినెంట్ బ్లాక్ హెయిర్ ను కోరుకుంటున్నారా.. అయితే ఈ రెమెడీ మీ కోసమే!