దానిమ్మ పండ్ల సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే అనువైన రకాలు ఇవే..!
TeluguStop.com
ప్రస్తుతం రైతులు( Farmers ) ఎప్పుడూ వేసే సాధారణ పంటలే కాకుండా ఉద్యానవన పంటలు వేయడానికి కాస్త అధిక ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ క్రమంలో కొంతమంది రైతులు దానిమ్మ పంటను సాగు చేసి ఆశించిన స్థాయిలో దిగుబడులు సాధించడంలో విఫలం అవుతున్నారు.
దానిమ్మ పంట సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే అత్యంత కీలకం అధిక దిగుబడులను ఇచ్చే అనువైన రకాలను ఎంపిక చేసుకుని సాగు చేయడమే.
దానిమ్మ పంటను ఉష్ణ మండల పంటగా చెప్పుకోవచ్చు.నిమ్మ పంట ఎంత చలి ఉన్నా, ఎంత వేడి ఉన్నా వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా తట్టుకోగలుగుతుంది.
దానిమ్మ పంట సాగుకు క్షారత ఎక్కువగా ఉండే నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.
దానిమ్మ పంటను సాగు చేయాలి అనుకునే రైతులు ముందుగా చీడపీడల బారిన పడకుండా ఉండి, అధిక దిగుబడులను( High Yields ) ఇచ్చే అనువైన విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలి.
ఆ అనువైన మేలు రకాల గురించి తెలుసుకుందాం. """/" /
H3 Class=subheader-styleరూబీ/h3p: ఈ అనువైన రకాన్ని బెంగళూరులో ఉండే IIHR అభివృద్ధి చేసింది.
ఈ రకానికి చెందిన దానిమ్మ పండు పై తొక్క ఎరుపు గోధుమ రంగులో ఉంటుంది.
ఈ రకానికి చెందిన దానిమ్మ పండు బరువు సుమారుగా 270 గ్రాములు ఉంటుంది.
ఈ రకాన్ని సాగు చేస్తే ఒక ఎకరం పొలంలో 16 టన్నులకు పైగా దిగుబడి పొందవచ్చు.
మస్కత్: ఈ రకానికి చెందిన దానిమ్మ పండు గులాబీ రంగు గింజలను కలిగి ఉంటుంది.
పండు పైభాగం ఎరుపు రంగులో ఉంటుంది.ఈ రకానికి చెందిన పండు బరువు సుమారుగా 300 గ్రాములకు పైగా ఉంటుంది.
ఒక ఎకరం పొలంలో దాదాపుగా 18 టన్నుల దిగుబడి పొందవచ్చు.h3 Class=subheader-styleగణేష్/h3p: ఈ రకానికి చెందిన పండ్ల పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది.
మహారాష్ట్రలో వాణిజ్య పంటగా ఈ రకాన్ని సాగు చేస్తారు.ఒక చెట్టు నుండి దాదాపుగా 10 కిలోల దిగుబడి పొందవచ్చు.
"""/" /
H3 Class=subheader-styleమృదుల/h3p: ఈ రకానికి చెందిన పండ్లు చూడడానికి కాస్త గణేష్ రకానికి చెందిన పండ్ల లాగే ముదురు ఎరుపు రంగులో ఉంటాయి.
ఈ రకానికి చెందిన పండు కాయ బరువు 300 గ్రాముల వరకు ఉంటుంది.
H3 Class=subheader-styleజ్యోతి/h3p: ఈ రకాన్ని IIHR బెంగుళూరు అభివృద్ధి చేసింది.పండు ముదురు రంగుతో ఆకర్షణీయకంగా ఉంటాయి.
ఈ రకం ఎంత వేడినైనా తట్టుకొని అధిక దిగుబడి ఇస్తుంది.