తమ సినిమాల్లో హీరోలు లేకపోయినా నడిపించే సత్తా ఉన్న హీరోయిన్స్ వీరే!
TeluguStop.com
ప్రెజెంట్ హీరో ఇమేజ్ నుండి ప్రేక్షకులు పూర్తిగా బయట పడుతున్నారు.కేవలం కంటెంట్ కు ప్రాధాన్యత ను ఇచ్చి హిట్ చేస్తున్నారు.
ప్రేక్షకుల మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది.హీరో విషయంలో ముందు ఉన్నంత విషయం ఇప్పుడు కనిపించడం లేదు.
స్టార్ హీరో లేకపోయినా.చిన్న సినిమా అయినా సినిమాలు సూపర్ హిట్ అవుతున్న నేపథ్యంలో హీరో ఇమేజ్ నుండి సంపూర్ణంగా బయట పడుతున్నారు.
స్టార్ హీరోల సినిమాలో కేవలం హీరో మాత్రమే ఉన్నాడు.కథ ఎక్కడ ఉంది అనే స్థాయికి ఆడియెన్స్ మైండ్ సెట్ ఎదిగింది.
అందుకే ఇదివరకులా గుడ్డిగా వెళ్లకుండా నిర్మాతలు కూడా కంటెంట్ కథలని నమ్ముకుని సినిమాలు సెట్ చేస్తున్నారు.
లేడీ ఓరియెంటెడ్ అని చెప్పి స్టార్ హీరోయిన్ లను సినిమాల్లో పెట్టి బాక్సాఫీస్ హిట్ అందుకుంటున్నారు.
మరి ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోయిన్లలో ఆ క్రేజ్ ఉన్న ముగ్గుగుమ్మలు ఎవరెవరు ఉన్నారంటే.
"""/"/ కీర్తి సురేష్.సాయి పల్లవి.
సమంత.ఇలా ఈ క్రేజీ భామలు లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసారని కరెక్ట్ కంటెంట్ పడితే హీరో లేకపోయినా కోట్లు తెచ్చే సత్తా ఉంది.
సమంత ఇప్పటికే కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది.ఇక ఇటీవలే యశోద సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది.
"""/"/అలాగే కీర్తి సురేష్ మహానటి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు.
ఈ సినిమా ఈ అమ్మడిని స్టార్ హీరోయిన్ చేసేసింది.ఇక సాయి పల్లవి గురించి చెప్పాల్సిన పని లేదు.
హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది.
ఈమె సినిమాలో హీరో ఉన్న తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది.ఈ ముగ్గురి హీరోయిన్ లకు సరైన కంటెంట్ పడితే స్టార్ హీరోల రేంజ్ లో బాక్సాఫీస్ ను దున్నేస్తారు.
ఆ విషయంలో మెగా కోడలిని ఫాలో అవుతున్న అక్కినేని కోడలు… ఏమైందంటే?