బతుకమ్మపూలలో ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

బతుకమ్మపూలలో ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే!

మన తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే పండుగలలో బతుకమ్మ పండుగ( Bathukamma Festival ) ఎంతో ముఖ్యమైనది అని దాదాపు చాలామందికి తెలుసు.

బతుకమ్మపూలలో ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే!

ఈ పండుగ సెలబ్రేషన్ అంతా పువ్వులలోనే దాగి ఉంటుంది.బతుకమ్మను అలంకరించడానికి ఉపయోగించే పువ్వులు( Flowers ) ఔషధ గుణాలతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి.

బతుకమ్మపూలలో ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే!

ఏ పువ్వుకు ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే సీతమ్మ వారి జడ గంటల పూలను సెలోసియా పులనీ( Celosia ) పిలుస్తారు.

ఈ పువ్వులు దృష్టిలోపానికి ఎంతగానో ఉపయోగపడతాయి.కళ్ళు ఎర్రగా మారడం, హైబీపీ ( High BP )తదితర జబ్బులకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

పశ్చిమ మధ్య ఆఫ్రికా దేశాల వారు ఈ పూలు లేతగా ఉన్నప్పుడు కోసేసి సూప్ తయారు చేసుకొని తాగుతూ ఉంటారు.

"""/" / ముఖ్యంగా చెప్పాలంటే వీటి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

వీటి ఆకులను ముద్దగా చేసి గాయాలపై రాసుకోవచ్చు.చర్మ సమస్యలు ఉన్నవారు ఈ పేస్టుని లేపనంగా చేసుకోవచ్చు.

మలబద్ధకం, రక్తహీనత, హై బీపీ లాంటి వ్యాధులు ఉన్నవారు వీటిని వండుకొని తినడం కూడా ఎంతో మంచిది.

ఇంకా చెప్పాలంటే పూర్వం రోజుల నుంచి తంగేడు పూలను ( Tangedu Flower )ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర పుష్పంగా ఈ పువ్వు ఉంది.బతుకమ్మను అలంకరించడంలో ఈ తంగేడు పూలను కూడా ఉపయోగిస్తారు.

వీటి శాస్త్రీయ నామం కాసియా అరిక్యులాటా( Cassia Auriculata ) ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఔషధంగా ఉపయోగించే అలవాటు ఇప్పటికీ కొనసాగుతోంది.

"""/" / అలాగే నెలసరి సరిగ్గా రాని మహిళలు దీన్ని మందుగా వాడడం వల్ల ఈ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు.

దీని కాషాయం చేసుకుని తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది.ఇంకా చెప్పాలంటే ఏ పండుగలోనైనా బంతి, చామంతి పూలు( Banthi Chamanthi ) కచ్చితంగా ఉంటాయి.

ఈ రెండు రకాల పువ్వులను ఇంటి అలంకరణ కోసం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

అలాగే బతుకమ్మను అలంకరించడంలో వీటికి ప్రత్యేకమైన స్థానం ఉంది.ఈ పువ్వుల్లో యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి.

అలాగే మన శరీరంలో పాదాలు, కళ్ళు, నోరు, చర్మం పై వచ్చే ఇన్ఫెక్షన్ల( Skin Infections )ను దూరం చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్17, గురువారం 2025