Eggplant : వంకాయలో అధిక దిగుబడి ఇచ్చే మేలు విత్తన రకాలు ఇవే..!

రైతులు ఏ పంటను సాగు చేసిన అధిక దిగుబడులు పొందాలంటే మేలు రకం విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.

విత్తన ఎంపికలో పొరపాటు జరిగితే ఆశించిన స్థాయిలో అధిక దిగుబడులు పొందలేం.రైతులు వంకాయ ( Eggplant )పంటను సాగు చేయాలనుకుంటే స్వల్ప కాలిక పంటగా సాగు చేయాలి.

దీర్ఘ కాలిక పంటగా సాగు చేస్తే వివిధ రకాల చీడపీడల, తెగుళ్ల బెడద( Pests ) ఎక్కువ.

వంకాయ సాగులో అధిక దిగుబడులు ఇచ్చే మేలు రకాలు ఏమిటో చూద్దాం.పూస క్రాంతి రకం సాగు చేస్తే సుమారుగా 15 టన్నుల దిగుబడి పొందవచ్చు.

ఈ రకం పంట కాలం 130 నుంచి 150 రోజులు. """/" / శ్యామల రకం సాగు( Cultivation Of Black Variety ) చేస్తే సుమారుగా 10 టన్నుల దిగుబడి పొందవచ్చు.

ఈ రకం పంట కాలం కూడా 130 నుంచి 150 రోజులే.భాగ్యమతి రకం సాగు చేస్తే సుమారుగా 14 టన్నుల దిగుబడి పొందవచ్చు.

ఈ రకం పంటకాలం 150 నుంచి 165 రోజులు.ఈ రకాలలో ఏదో ఒక రకాన్ని ఎంపిక చేసుకొని నారు పోసుకోవాలి.

నారు పెంచే మట్టి బెడ్డు నాలుగు అంగుళాల ఎత్తు ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి.

బెడ్డుకి, బెడ్డుకి మధ్య దూరం ఒక అడుగు ఉండాలి.బెడ్ పై ఒక సెంటీమీటర్ దూరం ఉండేలా పొడవుగా, వెడల్పుగా గీతలు గీయాలి.

విత్తనాల మధ్య దూరం ఒక సెంటీమీటర్ ఉండేటట్లు విత్తి పైపాటుగా వరిగడ్డిని పలుచుగా కప్పాలి.

"""/" / ఇక సేంద్రియ ఎరువులకు( Organic Fertilizers ) అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు డ్రిప్ విధానం ద్వారా నీటిని అందించడం వల్ల కలుపు సమస్య తక్కువగా ఉంటుంది.

దీంతో నాణ్యమైన అధిక దిగుబడి పొందవచ్చు.సేంద్రియ ఎరువులకు అధిక ప్రాధాన్యమిస్తే.

మొదట్లో తక్కువ దిగుబడి వచ్చిన క్రమంగా దిగుబడి పెరుగుతుంది.మేలురకం విత్తన రకాలు సాగు చేస్తే పెట్టుబడితో పాటు శ్రమ కూడా తగ్గుతుంది.

వీడియో: జాబ్ మానేస్తున్నానన్న ఉద్యోగిని.. మేనేజర్ ఊహించని రియాక్షన్ వైరల్..!