వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరే నాలుగు జట్లు ఇవే..!

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) టోర్నీ దాదాపుగా చివరి దశకు చేరుకుంది.

సెమీ ఫైనల్ చేరేందుకు టోర్నీలో పాల్గొన్న ప్రతి జట్టు తమ శాయ శక్తులు ఒడ్డుతున్నాయి.

ప్రస్తుతం జరుగుతున్న మ్యాచులు అన్ని హై ఓల్టేజ్ మ్యాచులే.సెమీఫైనల్ చేరే జట్ల విషయానికి వస్తే.

భారత్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా సెమీఫైనల్ కు అర్హత సాధించాయి.మిగిలి ఉన్న నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య పోటీ నెలకొంది.

"""/" / మరి సెమీఫైనల్ చేరే నాలుగో జట్టు ఏదో ఓసారి పరిశీలిద్దాం.

న్యూజిలాండ్ జట్టు( New Zealand ) శ్రీలంకపై ఒక భారీ విక్టరీ కొడితే సెమీఫైనల్ చేరుతుంది.

వరుసగా నాలుగు మ్యాచ్లలో ఓడిపోయిన న్యూజిలాండ్ కు కాస్త కోలుకోలేని దెబ్బ తగిలింది.

చివరి మ్యాచ్లో సాధారణ గెలుపు కాకుండా భారీ విక్టరీ సాధిస్తేనే రన్ రేట్ పరంగా సెమీఫైనల్ కు అర్హత సాధిస్తుంది.

పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్ కు అర్హత సాధించాలంటే.ఇంగ్లాండ్ జట్టుపై అద్భుత ఆటను ప్రదర్శించి భారీ పరుగుల తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది.

అయితే పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్ చేరాలంటే అద్భుతం జరగాల్సిందే. """/" / పసికూన ఆఫ్ఘనిస్తాన్( Afghanistan ) జట్టు విషయానికి వస్తే.

తాజాగా జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధిస్తుంది అని అంతా భావించారు.

కానీ ఆస్ట్రేలియా జట్టు బ్యాటర్ మ్యాక్స్ వెల్ చెలరేగడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఓటమిని చవిచూసింది.

పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియా జట్టును మ్యాక్స్ వెల్ మొత్తం లెక్కలన్నీ మార్చేసి ఆస్ట్రేలియా జట్టుకు సెమీస్ బెర్త్ ఖరారు చేశాడు.

ఇక ఆఫ్ఘనిస్తాన్ జట్టు సౌత్ ఆఫ్రికాపై తప్పక గెలవాల్సి ఉంది.న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తమ తదుపరి మ్యాచ్లలో గెలిచినా కూడా రన్ రేట్ పరంగా సెమీఫైనల్ బెర్త్ ఖరారు అవ్వనుంది.

కాబట్టి చివరి దశలో ఉన్న మ్యాచ్లన్నీ హై వోల్టేజ్ ను క్రియేట్ చేస్తున్నాయి.

మరి ఏ జట్టు సెమీఫైనల్ చేరుతుందో చూడాల్సి ఉంది.

గ్రీన్ టీ రాస్తే జుట్టు రాలడం కంట్రోల్ అవుతుందా.. అసలు ఎలా ఉపయోగించాలి?