ఆరోగ్యమైన జీవితం కోసం మహిళలు కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే!
TeluguStop.com
సాధారణంగా చాలా మంది మహిళలు ఇంట్లో అందరి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు.
కానీ తమకు ఏం కావాలో పెద్దగా పట్టించుకోరు.కానీ ఆరోగ్యమైన, అందమైన జీవితం కోసం మహిళలు కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారాలు కొన్ని ఉన్నాయి.
అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఇంటి పనులు, వంట పనులు, ఆఫీసు పనులు చూసుకుంటూ రోజంతా మహిళలు ఎనర్జిటిక్ గా ఉండాలంటే ప్రోటీన్ ఎంతో అవసరం.
కాబట్టి పెసలు, శనగలు, బీన్స్, పప్పు ధాన్యాలు వంటివి రెగ్యులర్ డైట్ లో ఉండేలా చూసుకోవాలి.
అలాగే మహిళలు నిత్యం గుప్పెడు నట్స్ అండ్ సీడ్స్ ను తీసుకోవాలి. బాదం, వాల్ నట్స్, పిస్తా, జీడిపప్పు, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, అవిసె గింజలు ఇలా మీకు నచ్చిన నట్స్ అండ్ సీడ్స్ ను ఎంపిక చేసుకుని నిత్యం తీసుకోవాలి.
వీటిలో పోషకాలు దట్టంగా ఉంటాయి.ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.
"""/" /
మహిళలు ఏ చిన్న నొప్పి వచ్చినా పెయిన్ కిల్లర్( Pain Killer ) వేసుకుంటూ ఉంటారు.
కానీ మన వంట గదిలో ఉండే అల్లం ఏ నొప్పికైనా సహజ మెడిసిన్ లా పని చేస్తుంది.
అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.అల్లం( Ginger )ను నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకుంటే వివిధ రకాల నొప్పులు, వాపులను సహజంగానే నివారించుకోవచ్చు.
"""/" /
అలాగే ఆడవారు నిత్యం ఏదో ఒక ఆకుకూరను తీసుకోవాలి.విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కు ఆకుకూరలు గొప్ప మూలం.
రోజుకు ఒక ఆకుకూరను తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.శరీర బరువు అదుపులో ఉంటుంది.
మధుమేహం వచ్చే రిస్క్ తగ్గుతుంది.శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలు ఆకుకూరల ద్వారా లభిస్తాయిఇక మహిళలు నిత్యం తీసుకోవాల్సిన ఆహారాల్లో వెల్లుల్లి ఒకటి.
ముఖ్యంగా రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తింటే చాలా మంచిది.వెల్లుల్లి ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది.
మరియు డీఎన్ఏ దెబ్బతినకుండా చేస్తుంది.వెల్లుల్లిలోని జింక్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
విటమిన్ సి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.
అల్లు, మెగా ఫ్యామిలీలు కలిసిపోయినట్టేనా.. ఈ కుటుంబాల మధ్య గ్యాప్ తగ్గుతుందా?