బొప్పాయి పండుతో పాటు పొరపాటున కూడా తీసుకోకూడని ఆహారాలు ఇవే..!

ఈ ప్రకృతి మనకు వరంగా ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో బొప్పాయి( Papaya ) ఒకటి.

బొప్పాయి రుచికరంగా ఉండడం వల్ల పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.

అలాగే బొప్పాయిలో అనేక రకాల విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

అందువల్ల ఆరోగ్యపరంగా బొప్పాయి పండు అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.ఎన్నో జబ్బుల నుంచి రక్షిస్తుంది.

అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ బొప్పాయిని తీసుకుని సమయంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖ్యంగా ప‌లు ఆహారాలను బొప్పాయితో పాటుగా పొరపాటున కూడా తీసుకోకూడదు.ఆ ఆహారాలు ఏవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బొప్పాయి తిన్న వెంటనే పాలు, టీ, కాఫీ వంటివి తీసుకోవడం లేదా ఆ పానీయాలు తీసుకున్న వెంటనే బొప్పాయి తినడం చేయకూడదు.

వీటిని ఒకేసారి తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యకు దారి తీస్తుంది.కొందరిలో మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.

"""/" / బొప్పాయి మ‌రియు పెరుగు ఒకేసారి తీసుకోవడం, కలిపి తీసుకోవడం చేయకూడదు.

బొప్పాయి, పెరుగు అనేది వరస్ట్ కాంబినేషన్.పెరుగు ఒంటికి చలువ చేస్తే.

బొప్పాయి వేడి చేస్తుంది.ఈ రెండిటినీ కలిపి తీసుకుంటే తలనొప్పి వస్తుంది.

"""/" / బొప్పాయితో పాటుగా నారింజ, ద్రాక్ష, నిమ్మ‌ వంటి సిట్రస్ పండ్ల‌ను తీసుకోకూడ‌దు.

ఈ రెండింటిని కలపడం వల్ల కొంతమందిలో ఎసిడిటీ లేదా గుండెల్లో మంట వస్తుంది.

కడుపు నొప్పి, విరేచనాలు వంటివి కూడా త‌లెత్తుతాయి.అలాగే బొప్పాయి పండ్ల‌ను స్పైసీ ఫుడ్స్( Spicy Foods ) తో జ‌త చేసి లేదా ఒకేసారి తిన‌కూడ‌దు.

బొప్పాయితో స్పైసీ ఫుడ్స్ కలపడం వల్ల జీర్ణవ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది.మరియు జీర్ణశయాంతర సమస్యలను పెంచుతుంది.

బొప్పాయి ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది.అందువ‌ల్ల బొప్పాయితో పాటు మాంసం, చేపలు, గుడ్లు త‌దిత‌ర ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ను తిన‌కూడ‌దు.

అధిక ప్రోటీన్ ఆహారాలతో పాటుగా బొప్పాయిని తీసుకుంటే జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది.

అమ్మో, గడ్డకట్టిన సరస్సుపై కుక్క.. ప్రాణాలకు తెగించి రక్షించిన భారతీయుడు..