డెంగ్యూ, మలేరియా వచ్చిన వారు బొప్పాయి మాత్రమే కాదు.. ఇవీ తీసుకోవాలి!
TeluguStop.com
అసలే ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతోంది.ఈ సీజన్‌లో డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతకమైన వ్యాధులు అధికంగా విజృంభిస్తూ ఉంటాయి.
ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ డెంగ్యూ, మలేరియా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.
ఈ విష జ్వరాలను సకాలంలోనే గుర్తించి చికిత్స పొందకపోతే.ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదముంది.
అలాగే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడినప్పుడు ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖ్యంగా ఆ టైమ్‌లో చాలా మంది బొప్పాయి, బొప్పాయి ఆకుల రసం తీసుకోమని చెబుతుంటారు.
ఎందుకంటే, బొప్పాయి మరియు బొప్పాయి ఆకుల్లో.ఉండే అమోఘమైన పోషకాలు ప్లేట్ లెట్స్ ను అద్భుతంగా పెంచుతాయి.
అలాగే రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఆయా వ్యాధుల నుంచి త్వరగా బయటపడేలా చేస్తాయి.
అయితే బొప్పాయి మాత్రమే కాదు డెంగ్యూ, మలేరియా వ్యాధులు వచ్చినప్పుడు మరికొన్ని ఆహారాలను కూడా తీసుకోవాలి.
అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.డెంగ్యూ, మలేరియా వంటివి సోకినప్పుడు బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం.
అందుకోసం వాటర్‌తో పాటు కొబ్బరి నీళ్లు, నిమ్మ రసం, దానిమ్మ రసం, మజ్జిగ, రాగి జావ వంటివి తరచూ తీసుకోవాలి.
అలాగే ఆ సమయంలో నీరసం, అలసటను దూరం చేసుకునేందుకు ప్రోటీన్ సమృద్ధిగా ఉండే నట్స్, పాలు, పాల ఉత్పత్తులు, పప్పు దినుసులను డైట్‌లో చేర్చుకోవాలి.
"""/"/
మెంతులు.డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలను వదిలించడంలో గ్రేట్‌గా సహాయపడతాయి.
అందుకే ఆ టైమ్‌లో మెంతులను ఏదో ఒక రూపంలో రెగ్యులర్‌గా తీసుకోవాలి.తాజా కూరగాయల రసం, సిట్రస్ పండ్లు, వెజిటబుల్ సూప్స్, తులసి టీ, ఉసిరి జ్యూస్, వేపాకుల టీ, తాజా పండ్లు వంటి ఆహారాలు మరియు పానియాలు కూడా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నుండి త్వరగా రికవరీ అవ్వడానికి సహాయపడతాయి.
నాగచైతన్య శోభిత పెళ్లి… శోభిత ఫ్యామిలీ ఆ ఒక్కటి అడిగారు : నాగార్జున