వ‌య‌సు 30 దాటిందా..? అయితే మీరీ ఫుడ్స్ రెగ్యుల‌ర్‌గా తినాల్సిందే!

ఈ  కాలంలో వ‌య‌సు 30 దాటిందంటే చాలు.అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్టు ముట్టేస్తున్నాయి .

మ‌ధుమేహం, ర‌క్త పోటు, కీళ్ల నొప్పులు, జీర్ణ స‌మ‌స్య‌లు, మెద‌డు ప‌ని తీరు త‌గ్గ‌డం.

ఇలా ఎన్నెన్నో స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.అయితే వీట‌న్నిటికీ దూరంగా ఉండాలీ అనుకుంటే ముప్పై ఏళ్లు దాటిన వారు ఖ‌చ్చితంగా త‌మ రెగ్యుల‌ర్ డైట్‌లో కొన్ని కొన్ని ఫుడ్స్‌ను చేర్చుకోవాల్సి ఉంటుంది.

మ‌రి ఆ ఆహారాలు ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.చియా సీడ్స్‌.

ఎన్నో పోష‌క విలువ‌లు క‌లిగి ఉండ‌టం వ‌ల్ల ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

ముఖ్యంగా ముప్పై ఏళ్లు దాటిన వారంద‌రూ ప్ర‌తి రోజు చియా సీడ్స్‌ను తీసుకుంటే అందులో ఉండే ప‌లు పోష‌కాలు బ‌రువును అదుపులో ఉంచ‌డంలోనూ, జీర్ణ స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా చేయ‌డంలోనూ స‌హాయ‌ప‌డ‌తాయి.

మెంతులు.వీటిని ముప్పై ఏళ్లు పైబ‌డిన వారు రెగ్యుల‌ర్‌గా ఏదో ఒక రూపంలో తీసుకుంటే క్యాన్స‌ర్‌, మ‌ధుమేహం, పక్షవాతం వంటి వ్యాధులు వ‌చ్చే రిస్క్ త‌గ్గు ముఖం ప‌డుతుంది.

అదే స‌మ‌యంలో చ‌ర్మం, జుట్టు ఆరోగ్యంగా మార‌తాయి. """/" / ముప్పై ఏళ్లు దాటాయంటే.

స్త్రీ, పురుషులు ఇద్ద‌రిలోనూ లైంగిక శ‌క్తి క్ర‌మంగా త‌గ్గి పోతుంటుంది.ఫ‌లితంగా ఒత్తిడి, టెన్ష‌న్స్ మ‌రియు ఇత‌ర స‌మ‌స్య‌లు పెరిగి పోతాయి.

అందు వ‌ల్ల రోజూ నిద్రించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ల్లో  అర టీ స్పూన్ అశ్వ‌గంధ పొడిని క‌లిపి తీసుకోవాలి.

ఖ‌ర్జూరాలు, అవ‌కాడో, గుమ్మడికాయ గింజ‌లు, అరటి పండ్లు వంటి వాటిపి కూడా డైట్‌లో చేర్చుకోవాలి.

త‌ద్వారా లైంగిక శ‌క్తి పెరుగుతుంది. """/" / అలాగే బాదం, వాల్ న‌ట్స్‌.

ఈ రెండిటినీ ప్ర‌తి రోజు తీసుకుంటే గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.

మెద‌డు ప‌ని తీరు మెరుగు ప‌డుతుంది.మ‌రియు ఎముక‌లు, కండరాలు దృఢంగా మార‌తాయి.

ఇక వీటితో పాటుగా ముప్పై ఏళ్లు దాటిన వారు సిట్ర‌స్ ఫ్రూట్స్‌, ఆకుకూర‌లు, వెల్లుల్లి, అవిసె గింజ‌లు వంటి వాటిని కూడా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జ‌రుగుతుంది.

టాయిలెట్‌లో వింత శబ్దం.. తీరా చూస్తే 10 అడుగుల పెద్ద పాము?