వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయాల‌నుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ మీకే!

ప్ర‌స్తుత రోజుల్లో చిన్న వ‌య‌సులోనే చాలా మంది ముఖంలో వృద్ధాప్య ల‌క్ష‌ణాలు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తుంటాయి.

ముడ‌త‌లు, చారలు, చ‌ర్మం సాగిపోవ‌డం, స్కిన్ పిగ్మెంటేషన్.ఇవ‌న్నీ వృద్ధాప్య ల‌క్ష‌ణాలే.

వాతావరణ మార్పులు, ఆహారపు అలవాట్లు, నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం, మ‌ద్య‌పానం, ధూమ‌పానం, శ‌రీరానికి శ్ర‌మ లేక‌పోవ‌డం వంటి ర‌క‌ర‌కాల కారణాల వ‌ల్ల ముఖంలో ముసలితనం తొంద‌ర‌గా వచ్చేస్తుంటుంది.

ఈ లిస్ట్‌లో మీరు ఉండ‌కూడ‌ద‌ని అనుకుంటున్నారా.? వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయాల‌ని భావిస్తున్నారా.

? అయితే వెంట‌నే ఇప్పుడు చెప్ప‌బోయే ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి.బొప్పాయి పండు.

వృద్ధాప్యాన్ని ఆల‌స్యం చేయ‌డానికి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.బొప్పాయిని ఆహారంలో భాగం చేసుకుంటే.

అందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె, మ‌రియు కెరోటినాయిడ్స్ వంటి పోష‌కాలు ఏజింగ్ ప్రాసెస్‌ను ఆల‌స్యం చేస్తాయి.

చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా మ‌రియు నిగారింపుగా మారుస్తాయి.పాల‌కూర‌.

ఆరోగ్యానికే కాదు చ‌ర్మానికి చాలా మేలు చేస్తుంది.వారంలో క‌నీసం మూడు సార్లు అయినా పాల‌కూర‌ను తీసుకుంటే.

స్కిన్ పిగ్మెంటేషన్, ముడతలు, చార‌లు వంటివి చ‌ర్మంపై ప‌డ‌కుండా ఉంటాయి.ఒక‌వేళ అవి ఉన్నా క్ర‌మంగా త‌గ్గిపోయి ముఖం గ్లోయింగ్‌గా మారుతుంది.

"""/" / అవకాడో పండు.దీని ధ‌ర కాస్త ఎక్కువే.

అయిన‌ప్ప‌టికీ వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయాల‌నుకునేవారు ఖ‌చ్చితంగా అవ‌కాడో పండును తీసుకోవాలి.రోజుకు ఒక అవ‌కాడో పండును తింటే చ‌ర్మం య‌వ్వ‌నంగా మెర‌వ‌డంతో పాటు ఆరోగ్యానికి కావాల్సిన అనేక పోష‌కాలు శ‌రీరానికి ల‌భిస్తాయి.

గుండె జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.క్యాన్స‌ర్ వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.

మధుమేహం, అధిక ర‌క్త‌పోటు వంటివి అదుపులో ఉంటాయి.చేప‌లు.

చ‌ర్మ ఆరోగ్యాన్ని కాపాడ‌టంలో సూప‌ర్‌గా హెల్ప్ చేస్తాయి.చేపల్లో పుష్క‌లంగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, విట‌మిన్ ఇ వంటి పోష‌కాలు వ‌య‌సు పెరిగినా వృద్ధాప్యాన్ని రాకుండా అడ్డుకుంటాయి.

అందుకే వారంలో చేపల‌ను ఒక్క‌సారైనా తీసుకోవాల‌ని చెబుతున్నారు.ఇక ఆ ఆహారాల‌తో పాటు కంటి నిండా నిద్ర‌పోవాలి.

మ‌ద్యపానం, ధూమ‌పానం అల‌వాట్లును మానుకోవాలి.రెగ్యుల‌ర్‌గా వ్యాయామాలు చేయాలి.

ఎప్పుడూ న‌వ్వుతూ ఉండాలి.చ‌ర్మంలో తేమ త‌గ్గ‌కుండా చూసుకోవాలి.

త‌ద్వారా వ‌య‌సు పెరిగినా య‌వ్వ‌నంగానే క‌నిపిస్తారు.

ఎడిటర్ ఇచ్చిన సలహా తో నిలబడిన తెలుగు సినిమాలు