Kidney Problems : చాలామంది లో కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీసే ఆహార పదార్థాలు ఇవే..!

మానవ శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పని చేయాలి.

ఆధునిక జీవన శైలిని అనుసరించే వారిలోని చాలా మందిలో ఊపిరితిత్తుల, గుండె,కాలేయ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

దీంతో పాటు కొంత మందిలో తీవ్ర కిడ్నీ సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి.

దీని కారణంగా శరీరంలోని మలినాలు పెరిగిపోతున్నాయి.ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్( Electrolytes Balance ) లో కూడా అనేక సమస్యలు వస్తున్నాయి.

దీని కారణంగా కొంత మంది మరణిస్తున్నారు.అయితే మీరు కూడా కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ఈ ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

"""/" / ముఖ్యంగా చెప్పాలంటే అరటి పండ్ల( Banana )లో అధిక మోతాదులో పొటాషియం ఉంటుంది.

కాబట్టి ప్రతి రోజు వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కిడ్నీలు మరింత దెబ్బ తినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

దీంతో పాటు కొంత మందికి జీర్ణ సమస్యలు ( Digestive Problems )కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే బంగాళదుంప కూడా కిడ్నీలకు ఎంతో మేలు చేస్తుందనీ నిపుణులు చెబుతున్నారు.

అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం వల్ల కిడ్నీలో పని తీరు దెబ్బతింటుంది. """/" / ఇప్పటికే మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారు డైట్ లో వేయించిన బంగాళా దుంపను తీసుకోకపోవడం మంచిది.

ఇంకా చెప్పాలంటే ఉప్పులో సోడియం పరిమాణాలు ఎక్కువగా ఉంటాయి.దీని వల్ల రక్త పోటు పెరిగే అవకాశం ఉంది.

అంతేకాకుండా మూత్రపిండాల పై ఒత్తిడి కూడా పెరుగుతుంది.కాబట్టి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు ఉప్పు కాస్త తక్కువ గా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే సోడాలో ఎక్కువగా చక్కర పరిమాణాలు ఉంటాయి.ఇందులో పోషక విలువలు చాలా తక్కువగా ఉంటాయి.

కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు సోడాను తీసుకోకపోవడమే మంచిదనీ నిపుణులు చెబుతున్నారు.

స్టార్ హీరో ప్రభాస్ కు జోడీగా మృణాల్ నటిస్తున్నారా.. ఆమె రియాక్షన్ ఏంటంటే?