మటన్, చికెన్ కంటే ఎక్కువ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు ఇవే..!
TeluguStop.com
ముఖ్యంగా చెప్పాలంటే ప్రజలు శరీరం బలంగా ఉండడానికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు.
కొందరు టాబ్లెట్స్ ఉపయోగిస్తే, మరికొందరు పోషక ఆహారం పై దృష్టి పెడుతూ ఉంటారు.
బలంగా ఉండడానికి ఖర్చు చేసి మరి ఫిష్, చికెన్, మటన్ లాంటి మాంసాహారం తింటూ ఉంటారు.
కానీ అది తక్కువ ఖర్చుతోనే మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు.శరీరానికి చక్కటి బలాన్ని అందించే సహజమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి.
వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా డబ్బు కూడా వృధా కాదు.
అంతే కాకుండా మంచి అందం కూడా మీ సొంతం అవుతుంది.వీటిని తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
జీడిపప్పులు( Cashew ) ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో వేరుశనగలో కూడా అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
"""/" /
వేరుశనగ( Peanuts ) ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది.
ప్రతిరోజు ఒక గుప్పెడు పల్లీలు తింటే శరీరనికి ఎన్నో రకాల ప్రయోజనాలు అందుతాయి.
అలాగే శక్తి పెరుగుతుంది.వేయించిన వేరుశనగ తింటే మంచి ఫలితం ఉంటుంది.
వీటిని రాత్రంతా నానబెట్టి తీసుకోవడం వల్ల శరీరం బలంగా మారుతుంది.ఇంకా చెప్పాలంటే పుచ్చకాయ గింజల పప్పు కూడా బలవర్థకమైన ఆహారమే అని నిపుణులు చెబుతున్నారు.
మాంసం, జీడిపప్పు వంటి వాటికంటే పుచ్చకాయ గింజల( Watermelon Seeds ) పప్పు శరీరాన్ని బలంగా మారుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే శరీరానికి ఎంతో శక్తి అందుతుంది. """/" /
ఇంకా చెప్పాలంటే పచ్చి కొబ్బరి( Raw Coconut )ని ముక్కలుగా కట్ చేసి దానికి కాస్త బెల్లం కలిపి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
కానీ ఇప్పుడు దాని సంగతి ఎవరు అంతగా పట్టించుకోవడం లేదు.పచ్చి కొబ్బరిలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి.
కానీ చాలామంది దగ్గు వస్తుందని పచ్చి కొబ్బరి తినరు.కానీ పచ్చి కొబ్బరి తినడం వల్ల శరీర ఆరోగ్యమే కాకుండా చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 4, శుక్రవారం 2024