వీటిపైనే చంద్రబాబు మొదటి మూడు సంతకాలు
TeluguStop.com
టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ఈనెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి మూడు సంతకాలు కొన్ని కీలక అంశాలపై చేయబోతున్నారు.
గత ఎన్నికల సమయంలో ప్రధానంగా వీటిపై హామీ ఇవ్వడంతో , ఆ హామీని నెరవేర్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.
ఈనెల 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మెగా డిఎస్సి పై మొదటి సంతకాన్ని చేయనున్నారు.
గత వైసిపి ప్రభుత్వం ఎన్నికల కు ముందు హడావిడి గా డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
అంతే హడావుడిగా టెట్ , డీఎస్సీ పరీక్షలు నిర్వహించి ఫలితాలను కూడా ప్రకటించాలని ప్రయత్నించింది.
కానీ తమకు తగినంత సమయం ఇవ్వకుండా హడావుడిగా నోటిఫికేషన్లు జారీ చేయడంపై నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించడంతో, వాటికి హైకోర్టు బ్రేక్ వేసింది.
ఉద్యోగాల సంఖ్య కూడా తక్కువగా ఉండడంతో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ( Mega DSC Notification )విడుదల చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఈ మేరకు మొదటి సంతకాన్ని మెగా డీఎస్సీ పైనే చంద్రబాబు పెట్టబోతున్నారు. """/" /
రెండో సంతకాన్ని ల్యాండ్ అసెన్మెంట్ చట్టం( Land Assignment Act ) ద్వారా తమ భూములను లాక్కుంటోంది అని ఆందోళన చెందారు.
దీంతో తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
దీంతో రెండో సంతకాన్ని భూ హక్కు చట్టాన్ని రద్దు చేయడంపైనే చంద్రబాబు పెట్టనున్నారు.
ఇక మూడో సంతకం పెన్షన్ల పెంపు ( Increase In Pensions )పై ఉండబోతోంది .
"""/" /
వైసీపీ ప్రభుత్వ హయాంలో పెన్షన్లను ఐదేళ్లలో రెండు వేల నుంచి 3 వేలకు విడతల వారీగా పెంచారు.
అయితే తాము అధికారంలోకి రాగానే 3000 పెన్షన్ ను 4000 పెంచి ఇస్తామని , అలాగే పెంచబోయే పెన్షన్ ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని, ఏప్రిల్ , మే ,జూన్ నెలలో బకాయిలు మూడు వేలు ,జులై నెల పెన్షన్ 4000 తో కలిపి మొత్తం 7000 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఆ హామీ మేరకే మూడో సంతకాన్ని పెన్షన్ల పెంపు పై పెట్టబోతున్నట్లు టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి.
బాహుబలి తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి.. తమన్నా షాకింగ్ కామెంట్స్!