Ravi Teja Directors : రవితేజ పరిచయం చేసిన వాళ్లలో ఫెయిల్యూర్ అయిన దర్శకులు వీళ్లే…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సోలోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న హీరో రవితేజ.

( Ravi Teja ) అప్పట్లో ఈయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమం లో ప్రస్తుతం రవితేజ యంగ్ డైరెక్టర్లతో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇక రీసెంట్ గా ఈగల్ సినిమాతో మన ముందుకు వచ్చిన రవితేజ ఈ సినిమాతో ఒక యావరేజ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ఇప్పుడు ఆయన హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్( Mr.

Bachchan ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే రవితేజ ఇండస్ట్రీకి పరిచయం చేసిన చాలా మంది దర్శకులు సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

కానీ కొంతమంది మాత్రం ఫెయిల్యూర్ డైరెక్టర్లుగా మిగిలిపోయారు వాళ్ళు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

"""/" / రవితేజ హీరోకు 2003 వ సంవత్సరంలో వచ్చిన 'ఈ అబ్బాయి చాలా మంచోడు' అనే సినిమాతో అగస్త్యన్( Agastyan ) అనే దర్శకుడు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.

ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.అయినప్పటికీ ఆయన మరో సినిమా చేయలేదు.

ఇక రవితేజ నమిత హీరో హీరోయిన్లుగా వచ్చిన 'ఒక రాజు ఒక రాణి' అనే సినిమాతో డైరెక్టర్ యోగేష్( Director Yogesh ) ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.

ఆయన కూడా ప్లాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. """/" / ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆయన తర్వాత వెంకటేష్ తో చింతకాయల రవి అనే సినిమా తీశాడు.

ఈ సినిమా కూడా ఫ్లాప్ అవడంతో ఇండస్ట్రీలో ఆయనకు అవకాశాలు ఇచ్చే హీరోలు కరువయ్యారు.

టచ్ చేసి చూడు సినిమాతో విక్రమ్ సిరికొండ( Vikram Sirikonda ) అనే రైటర్ ని దర్శకుడుగా పరిచయం చేశాడు.

ఆ సినిమా సక్సెస్ అవ్వకపోవడంతో ఆయన మరొక సినిమా చేయలేదు.ప్రస్తుతం ఆయన కూడా ఫ్లాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.

విశ్వక్ సేన్ మెకానిక్ రాఖీ తో సక్సెస్ సాధించాడా..?