చాలా వెరైటీ ఫీచర్లతో అందుబాటులో ఉన్న ఇయర్‌ఫోన్స్ ఇవే..

నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్లు వాటి తక్కువ ధరలు, సురక్షితమైన ఫిట్ కారణంగా ఎప్పటికీ మోస్ట్ డిమాండెడ్ ఇయర్ ఫోన్స్ గా నిలుస్తున్నాయి.

కాగా కొన్ని నెక్‌బ్యాండ్స్‌ మార్కెట్ ప్రత్యేకమైన ఫీచర్లతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.అవి ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

H3 Class=subheader-styleAltec Lansing MZX856/h3p """/"/ ఈ ఇయర్‌ఫోన్లు ప్రొపర్ వాటర్‌ఫ్రూఫింగ్ కోసం IP67 రేటింగ్‌తో వస్తున్నాయి.

నీటిలో ఎక్కువగా సమయం గడిపే వారికి ఇవి బెస్ట్ ఛాయిస్‌ అవుతాయి.వీటిలో 9mm నియోడైమియమ్ డ్రైవర్లు, 20 గంటల ప్లేబ్యాక్ టైమ్, సాంగ్ నావిగేషన్/టెలిఫోనీ/వాల్యూమ్ కంట్రోల్ బటన్లు కూడా ఉన్నాయి.

రిలయన్స్ డిజిటల్‌లో దీని ధర రూ.2,100.

H3 Class=subheader-styleBoAt Rockerz 378/h3p ఈ ఇయర్‌ఫోన్లు THX ద్వారా ట్యూన్ చేయబడిన 3D స్పేషియల్ బయోనిక్ సౌండ్‌తో కూడిన పెద్ద డైనమిక్ డ్రైవర్లతో వస్తాయి.

3-డైమెన్షనల్ రియలిస్టిక్ ఆడియో, 25 గంటల బ్యాటరీ లైఫ్, డెడికేటెడ్ 'క్విక్-స్విచ్ బీస్ట్ మోడ్' బటన్‌లు దీనిలో అందించారు.

H3 Class=subheader-styleరియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ ప్రో/h3p """/"/ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)ని కలిగి ఉన్న కొన్ని నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్లలో రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ ప్రో ఒకటి.

ఇది నాయిస్ స్థాయిలను 35dB వరకు తగ్గిస్తుంది.ఇది LDACకి కూడా మద్దతిస్తుంది.

దీనిలో 990 Kbps వరకు హై-రెస్ ఆడియోను వినొచ్చు.దీని బ్యాటరీ లైఫ్ 22 గంటలుగా క్లెయిమ్ చేయబడింది.

H3 Class=subheader-styleనాయిస్ ఫ్లెయిర్ ఇయర్‌ఫోన్లు/h3p ఈ ఇయర్‌ఫోన్లు ప్రత్యేకమైన కాల్ వైబ్రేషన్ అలర్ట్ ఫీచర్‌తో వస్తాయి.

ఫోన్ సైలెంట్‌గా ఉన్నప్పుడు ఎలాంటి కాల్‌లను మిస్ కాకుండా ఉండేందుకు ఈ ఫీచర్ హెల్ప్ అవుతుంది.

ఇవి 35 గంటల బ్యాటరీ లైఫ్ అందించిన భారతదేశపు మొదటి ఇయర్‌ఫోన్లు కూడా! H3 Class=subheader-styleBlaupunkt BE100/h3p """/"/ ఈ ఇయర్‌ఫోన్లు 100 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 8 వారాల స్టాండ్‌బై టైమ్‌తో బ్యాటరీ లైఫ్ ఆఫర్ చేస్తాయి.

ఇవి కాల్ అలర్ట్ వైబ్రేషన్ ఫీచర్‌కు చిన్న డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది.

దీని ధర రూ.1,199.

భారతీయులకు గుడ్ న్యూస్.. ఈ దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చని తెలుసా?