మారుమూల గ్రామం అమ్మాయ్.. మోడల్ గా ఎదిగిన హాట్ బ్యూటీ.. ఇప్పుడు?

ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎంతోమంది, ఇక వారి కెరీర్ చివరి దశలో ఉందని తెలిసినప్పుడు వారు ఎక్కువగా రాజకీయాల వైపు మొగ్గు చూపుతుంటారు.

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో చూస్తున్నాము.సినీ రంగాన్ని వదిలేసి ప్రజలకు ఏదో చేయాలి అన్న ఉద్దేశంతో రాజకీయ రంగంలోకి దిగడం అన్నది చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి.

అయితే తాజాగా ఇలాంటి నిర్ణయాన్ని గుజరాత్ కు చెందిన సూపర్ మోడల్ ఏష్రా పటేల్ తీసుకుంది.

మోడల్ గా ఎదిగిన ఈ బ్యూటీ కెరిర్ బాగా పీక్స్ లో ఉన్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

త్వరలోనే గుజరాత్ లోని ఆరు వేల గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలోనే వివిధ రాజకీయ పార్టీలు ఎలా అయినాసరే గెలవాలి అని అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సూపర్ మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఏష్రా పటేల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది.

ఈ తరుణంలోనే బ్యూటీ ఇంటింటికి తిరుగుతూ తన ఆశయ సాధన కోసం ప్రచారం చేస్తూ సర్పంచ్ పదవికి తనకు ఓటు వేయాలని అభ్యర్థిస్తోంది.

గుజరాత్ లోని చోట ఉదయపూర్ ప్రాంతంలోని సాయిఖాడే తహసీల్ కోసం పోటీ చేస్తోంది ఈ బ్యూటీ.

"""/" / మారుమూల గ్రామానికి చెందిన జనరల్ కేటగిరీలో సర్పంచ్ పదవికి ఎన్నికలలో పోటీ చేస్తున్న మొట్టమొదటి మహిళ ఈమెనే.

అంతేకాకుండా ఈ గ్రామంలో పుట్టి మంచి మోడల్ స్థాయిని అందుకున్న ఈ బ్యూటీ తన స్వగ్రామం కోసం పీక్స్ లో ఉన్న తన కెరిర్ వదిలేయాలి అనుకుంటుంది.

ఇలాంటి సమయంలో ఆమె తన గ్రామంలో అందరూ ఎదుర్కొన్న సమస్యల గురించి, అలాగే కరోనా మహమ్మారి సోకినప్పుడు వాటి గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల చికిత్స తీసుకోలేకపోయారు.

ఇక కరోనా సమయంలో ప్రజల స్థితిగతులను గమనించిన ఆమె ఎలాగైనా వారికి సహాయం చేయాలని నిర్ణయించుకొని సర్పంచి పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపింది.

చరణ్ సిద్ధమైతే నేను కూడా రెడీ… చరణ్ తో సినిమాపై కృష్ణవంశీ కామెంట్స్?