సంక్షోభాల మధ్య ప్రధానిగా....“రిషి సునక్” ముందున్న సవాళ్లు ఇవే...!!

బ్రిటన్ ప్రధానిగా మన భారతీయుడు ఎన్నికవ్వడం నిజంగా ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ విషయమే.

ప్రస్తుతం రిషి బ్రిటీష్ ప్రజలను పాలించనున్నాడు.బ్రిటన్ లో రాచరికం ఉన్నా కూడా బ్రిటన్ ప్రభుత్వాన్ని శాసించే హక్కు అక్కడి రాజులకు లేదు.

దాంతో రిషి సునక్ ప్రస్తుతం తన వన్ మెన్ షో ను ప్రదర్శించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎట్టకేలకు రిషి తన టార్గెట్ రీచ్ అయిపోయారు కానీ తదుపరి మిగిలిందే అతి పెద్ద సవాల్.

ఎన్నో సమస్యలు ప్రస్తుతం బ్రిటన్ ను చుట్టుముట్టాయి.ఆర్ధిక సంక్షోభం నేపధ్యంలో నిన్నటి వరకూ ప్రధానిగా ఉన్న ట్రస్ తన పదవికి రాజీనామా చేసేశారు.

మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కు సైతం ప్రస్తుతం బ్రిటన్ ఎదుర్కుంటున్న సమస్యల నుంచీ గట్టెక్కించే సత్తా లేదని అంటున్నారు పరిశీలకులు ఈ కారణంగానే ప్రధాని రేసు నుంచీ తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు.

మరి ప్రధానిగా త్వరలో భాద్యతలు స్వీకరించనున్న రిషి సునక్ బ్రిటన్ ఆర్ధిక మాంద్యం నుంచీ గట్టెక్కించగలరా, అసలు రిషి ముందు ఉన్న సవాళ్లు ఏంటి.

రిషి సమర్ధత గురించి ప్రత్యేకించి ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలో కరోనా ప్రపంచాన్ని కబళిస్తున్న క్రమంలో తాను తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికి బ్రిటన్ ప్రజలకు గుర్తుంటాయి.

కరోనా సమయంలో రిషి సునక్ ప్రజలు, ఉద్యోగుల కోసం మెరుగైన ప్రధకాలను తీసుకొచ్చారు.

దాంతో రిషికి మంచి గుర్తింపు వచ్చింది.ఆ తరువాత జాన్సన్ రాజీనామాతో రిషినే కాబోయే ప్రధాని అంటూ ప్రచారం జరిగింది.

కానీ అనూహ్యంగా ట్రస్ ప్రధానిగా ఎన్నికయ్యారు.కానీ ఆమె తీసుకున్న నిర్ణయాలతో బ్రిటన్ భవిష్యత్తులో మరింత ఇబ్బందులను ఎదుర్కునే పరిస్థితులు నెలకొనడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఆమె రాజీనామాతో రిషి బ్రిటన్ భవిష్యత్ ప్రధానిగా త్వరలో భాద్యతలు చేపట్టనున్నారు.ఇదిలాఉంటే.

"""/"/ బ్రిటన్ ప్రస్తుతం ఆహార సమస్యలను ఎదుర్కుంటోంది.ఆర్ధిక సంక్షోభం కారణంగా పెరిగిపోయిన నిత్యావసర ధరలు, ఆహార ఉత్పత్తులతో సగానికిపైగా జనాభా ఒక పూట మాత్రమే తినే పరిస్థితులు నెలకొన్నాయి.

కాగా ట్రస్ తీసుకున్న ఆర్ధిక పరమైన నిర్ణయాల వలన బ్రిటన్ లో ఆర్ధిక మాంద్యం అమాంతం పెరిగిపోయింది.

అక్కడి ప్రజలు రోజు వారి తినే మాంసాహారం, బ్రెడ్, ఇంధన ధరలు చుక్కలనంటాయి.

పైగా ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం చూపింది.

ఒక పక్క ఆర్ధిక సమస్యలతో ఉన్న బ్రిటన్ ప్రజలు ఏం కొనాలన్నా కొండెక్కి కూర్చున్న ధరలతో సతమతమవుతున్నారు.

ఇన్ని సమస్యల నేపధ్యంలో ప్రధానిగా భాద్యతలు స్వీకరిస్తున్న సునక్ ఈ పరిస్థితులను ఎలా నెట్టుకొస్తారోననే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే రిషి మాత్రమే ప్రస్తుత పరిస్థితులను అదుపులోకి తీసుకురాగాలాడని,ఆ సత్తా రిషి కి మాత్రమే ఉందని అక్కడి ప్రజలు, పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు.

అందుకే ఎవరూ ఊహించని విధంగా సుమారు 193 మంది ఏపీల మద్దతుతో రిషి ప్రధానిగా ఎన్నికయ్యారు.

పీకల దాక తాగేసిన యువతి.. ఆ కంట్రీ ఫ్లైట్ తీసుకోబోయి తప్పు చేసిందే..?