చిన్న వయసులోనే కళ్ల కింద ముడతలు రావడానికి గల కారణాలు ఇవే..!

భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి ఎప్పటికీ యవ్వనంగా కనిపించాలని ఆశపడుతూ ఉంటాడు.

కానీ ఈ రోజుల్లో కొంతమందిలో 30 నుంచి 40 సంవత్సరాలకే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి.

దీనికి ప్రధాన కారణం జీవనశైలి ఆహారపు అలవాట్లే కారణం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒక వ్యక్తి ఆహారం, జీవనశైలి సరిగ్గా ఉంటే దాని ప్రత్యక్ష ప్రభావం అతని ముఖం, శరీరంపై కనిపిస్తుంది.

మంచి ఆరోగ్యం కావాలంటే మంచి ఆహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. """/" / చిన్న వయసులోనే కంటి కింద ముడతల ( Wrinkles )సమస్య కారణంగా చాలామంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

మరి ఈ సమస్యకు గల కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే తెల్ల చక్కెరతో చేసినవి లేదా శుద్ధి చేసిన చక్కెర తో చేసినవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం.

తెల్ల చక్కెర చర్మంతో పాటు జుట్టుకు కూడా చాలా ప్రమాదం.తీపి ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల వృద్ధాప్య ప్రక్రియ వేగవంతం అవుతుంది.

దీని ప్రభావం ముఖంపై స్పష్టంగా కనిపిస్తుంది.అంతేకాకుండా భారతదేశంలో చాలా మంది ప్రజలు నూనె మరియు వేయించిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతున్నారు.

"""/" / దీనితో పాటు నూనెను చాలా సార్లు వేడి చేయడం మరియు ఉపయోగించడం ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది.

ఇంట్లో ఉన్న బయట ఉన్న ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

దీనివల్ల గుండె జబ్బులు( Heart Diseases ) రావడమే కాకుండా ముఖంలో అధిక వయసు కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

బర్గర్లు, ఫ్రెంచ్ ప్రైస్ (French Fries ), సమోసాలు, డీప్ ఫ్రైడ్ చికెన్ వంటి ఆహారాలకు వీళ్లంతా దూరంగా ఉండడమే మంచిది.

ఇలాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల ముడతలు, మొటిమల సమస్య మొదలవుతాయి.ముఖ్యంగా చెప్పాలంటే మద్యం, సిగరెట్లు ఆరోగ్యానికి ఎంతో హానిచేస్తాయని దాదాపు చాలామందికి తెలుసు.

ఈ రెండిటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం త్వరగా పాడైపోతుంది.

మాయమాటలతో జనానికి కుచ్చుటోపీ.. సింగపూర్‌లో భారత సంతతి మహిళకు జైలు