ఫోన్ లుక్ ను అట్రాక్టివ్ గా మార్చే బెస్ట్ వాల్ పేపర్ యాప్స్ ఇవే..!

భారతదేశంలో చాలామంది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లనే వాడుతున్నారు.అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో వాల్ పేపర్స్ చాలా తక్కువగా ఉంటాయి.

దీంతో ఎంతోమంది తమ ఫోన్ లుక్ అట్రాక్టివ్ గా లేదని, ఫోన్ లుక్ అట్రాక్టివ్ గా ఉండేందుకు కొత్త రకం వాల్ పేపర్స్ కోసం ఆన్లైన్ లో సెర్చ్ చేస్తున్నారు.

అటువంటి వారి కోసం కొన్ని బెస్ట్ ఆండ్రాయిడ్ వాల్ పేపర్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి.

ఆ యాప్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.గూగుల్ వాల్ పేపర్స్ యాప్:( Google Wallpapers App ) ఈ యాప్ ఉచితంగానే కొన్ని బెస్ట్ వాల్ పేపర్స్ ఆఫర్ చేస్తుంది.

గూగుల్ ఆర్ట్స్, ల్యాండ్ స్కేప్స్, టెక్చర్స్, కల్చర్ లాంటి కలెక్షన్లను డౌన్లోడ్ చేసుకుని, వాల్ పేపర్ గా డిజైన్ కు అప్లై చేసుకోవచ్చు.

బ్యాక్ డ్రాప్స్:( Back Drops ) ఈ యాప్ కూడా ఉచితంగానే బెస్ట్ వాల్ పేపర్స్ ను అందిస్తోంది.

కమ్యూనిటీ సెక్షన్ నుంచి వాల్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.కాకపోతే ఎక్స్ ప్లోర్ ట్యాబ్ నుంచి సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత వాల్ పేపర్ ను నేరుగా అప్లై చేసుకోవచ్చు.

"""/" / పిక్స్ వాల్ పేపర్ యాప్:( Pics Wallpaper App ) ఈ యాప్ సింపుల్, ఫంక్షనల్ యూజర్ ఇంటర్ ఫేస్ అందిస్తుంది.

గూగుల్ పిక్సెల్ వాల్ పేపర్స్ నుంచి ప్రేరణ పొందిన ఇమేజెస్ ను పొందవచ్చు.

ఏ డివైస్ లో అయినా లేటెస్ట్ పిక్సెల్ వాల్ పేపర్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

"""/" / అబ్ స్ట్రాక్ట్ యాప్: ( Abstract App )యాప్ లో ఎక్కువగా నైరూప్య కళకు చెందిన వాల్ పేపర్స్ ఉంటాయి.

పెయిడ్ వాల్ పేపర్స్, ఫ్రీ వాల్ పేపర్స్ ఈ యాప్ లో ఉంటాయి.

మొబైల్ ఫోన్లో ఉండే పాత వాల్ పేపర్స్ తో విసుకు చెందినవారు.ఈ యాప్స్ లో ఉండే వాల్ పేపర్స్ తో మీ డివైస్ను రిఫ్రెష్ చేసుకోవచ్చు.

ట్రంప్ ర్యాలీలో మరోసారి భద్రతా లోపం.. స్టేజ్‌పైకి దూసుకొచ్చిన అగంతకుడు