బాడీ హీటెక్కిపోతుందా.. అయితే ఇలా చల్లబడండి!

ఒంట్లో వేడి ఎక్కువయిందని మన ఇంట్లో ఎవరో ఒకరు చెబుతూనే ఉంటారు.మనిషి యొక్క సాధారణ శరీర ఉష్ణోగ్రత దాదాపు 98.

6 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉంటుంది.ఒక‌వేళ శరీర ఉష్ణోగ్రత 99 లేదా 100 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువగా ఉంటే శరీరంలో వేడి అధికంగా ఉన్నట్లు అర్ధం.

శరీర ఉష్ణోగ్రతలు ఉండాల్సిన దానికంటే అధిక మొత్తంలో ఉంటే చాలా సమస్యలు తలెత్తుతాయి.

తీవ్రమైన తలనొప్పి, మూత్రం రంగు మారడం, మూత్ర విసర్జన సమయంలో మంట, ఒళ్ళు నొప్పులు, కళ్ళు మంటలు.

వంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి.ఇటువంటి సమస్యలు తలెత్తగానే వెంటనే చలువ చేసే ఆహారాలను డైట్ లో చేర్చుకుంటూ ఉంటారు.

మరి మీ బాడీ కూడా తరచూ హీటెక్కి పోతుందా.అయితే చల్లబడడానికి ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు అద్భుతంగా సహాయపడతాయి.

బాడీలో వేడి పెరగడానికి ప్రధాన కారణం డీహైడ్రేషన్.( Dehydration.

)ఎప్పుడైతే నీటి శాతం తగ్గుతుందో శరీర ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభమవుతాయి.అందువల్ల ఒంట్లో వేడి చేసినప్పుడు వాటర్ ను ఎక్కువగా తీసుకోండి.

వాట‌ర్ చాలా త్వరగా జీర్ణమై వెంటనే రక్తంలో కలుస్తాయి.తద్వారా శరీర ఉష్ణోగ్రతలు అదుపులోకి వస్తాయి.

"""/" / అలాగే మరొక అద్భుతమైన రెమెడీ ఉంది.దానికోసం ఒక గ్లాస్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ సోంపు, వన్ టేబుల్ స్పూన్ ధనియాలు( Coriander ), హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు ఆ నీటిని వడగట్టుకుని తాగాలి.ఇలా కనుక చేస్తే బాడీలో అధిక వేడి దెబ్బకు మాయం అవుతుంది.

ధనియాలు, సోంపు( Anise ), జీలకర్ర.బాడీని కూల్ చేయడానికి ఉత్తమంగా సహాయపడతాయి.

అదే సమయంలో శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను సైతం తొలగిస్తాయి. """/" / ఎర్ర మందారం టీ( Hibiscus Tea ) శరీరంలో అధిక వేడిని తొలగించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు ఎర్ర మందారం టీ తీసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది.

ఇక ఒంట్లో వేడి చేసినప్పుడు ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ మిక్స్ చేసి సేవించాలి.

కొబ్బరి నీళ్ళు( Coconut Water ), నిమ్మరసం.ఇవి రెండూ కూలింగ్ ప్రాపర్టీస్.

ఈ రెండిటినీ కలిపి తీసుకుంటే కనుక దెబ్బ‌కు బాడీ కూల్ గా మరియు హైడ్రేటెడ్ గా మారుతుంది.

కార్తీ అన్ని జానర్స్ లో సినిమాలను చేస్తున్నాడా..?